Telangana: సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు లెక్కచేయకుండా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.

New Update
Telangana: సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో నిన్న లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 ఎంపీ స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 64.74 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల సరళి చూస్తుంటే బీజేపీ అన్నీ స్థానాల్లో ముందంజలో ఉంది. మిగితా పార్టీల కంటే మెజారిటీ స్థానాలు సాధిస్తామని అనుకుంటున్నాం. తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టేందుకు కొత్త అప్పులు తెచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కాళేశ్వరం, ధరణి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది.

Also Read: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ 

బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కాదు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కవిత నిర్వాహకం వల్ల బీఆర్ఎస్ అదోగతి పాలయ్యింది. రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు లెక్కచేయకుండా ప్రజలు బీజేపీ వైపుకు నిలబడ్డారు. కేసిఆర్ తన పార్టీని కూటమిలో లేదా కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కలిసి మోడీ చరిష్మాను దెబ్బ తీసేందుకు కుట్ర చేశాయి. గ్రామం నుంచి పట్నం వరకు అన్ని సామాజిక వర్గాలు మోదీకి వెన్నుదన్నుగా నిలబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమిని నమ్మే పరిస్థితుల్లో దేశ ప్రజలు లేరు.

రేవంత్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి ఉచితాల పేరుతో ప్రజలకు భ్రమలు కల్పించి మోసం చేశారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ అప్పుల ఊబిలో పడిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకతే కాదు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం రేవంత్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటారని' లక్ష్మణ్ అన్నారు.

Also read: ప్రాణాలు తీసిన ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌ చాట్..

Advertisment
తాజా కథనాలు