BJP MP Laxman: హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

రేపు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవు ప్రకటించకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోడీ మనకు దేవుడి దూత అని అన్నారు. అటువంటి మహనీయుడు ప్రధానిగా ఉండటం మన అదృష్టం అని కొనియాడారు.

New Update
BJP MP Laxman: హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

BJP MP Laxman: ఆంధ్ర ప్రదేశ్ (AP Govt), తెలంగాణ ప్రభుత్వాలపై (Telangana Govt) ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేపు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవు (Holiday) ప్రకటించకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు హిందుత్వ మనోభావాలు అనుగుణంగా కాకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ALSO READ: చంద్రబాబును సీఎం చేయాలనే.. షర్మిలకు సజ్జల కౌంటర్

అందరికీ ఆహ్వానం..

రేపు అయోధ్యలో (Ayodhya) జరిగే రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అన్నీ మతాల వారికి ఆహ్వానం ఇచ్చామని అన్నారు ఎంపీ లక్ష్మణ్. ఐదు వందల ఏళ్ల పోరాటం అనంతరం రామమందిర నిర్మాణం రేపు జరగనుందని తెలిపారు. 140 మంది కోట్ల ప్రతినిధిగా ప్రధాని మోడీ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట కోసం 11 రోజుల దీక్ష చేస్తున్నారు ప్రధాని మోడీ అని అన్నారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆధ్యాత్మిక నగరంగా తీర్చి దిద్దనున్నారని అన్నారు. ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో అయోధ్య ఒక్కటి కావడం గర్వకారణం అని కొనియాడారు.

ప్రపంచ చరిత్రలో..

రేపు ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు అని అన్నారు ఎంపీ లక్ష్మణ్. రామయ్య ప్రాణప్రతిష్ఠ నేరుగా విక్షించలని అందరూ అనుకుంటారని.. కానీ అది అందరికీ సాధ్యం కాదు అందుకే ప్రపంచ వ్యాప్తంగా తెరలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పల్లెలో సైతం రాముని విగ్రహ ప్రతిష్టాపన స్వయంగా చూడాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. రాముడు సేవలో లక్ష్మణుడిగా సేవ చేసే అదృష్టం తనకు దక్కిందని పేర్కొన్నారు.

మోడీ మనకు దేవుడి దూత...

మోడీ మనకు దేవుడి దూత అని అన్నారు ఎంపీ లక్ష్మణ్. అటువంటి మహనీయుడిని ప్రధానిగా ఉండటం మన అదృష్టం అని కొనియాడారు. భక్తులు ఇచ్చే కానుకలతో దేశంలో దురాక్రమణకు గురైన ఆలయాలను తిరిగి ప్రధాని మోడీ పునర్నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. రేపటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇదొక అబ్బురపరిచే ఘట్టం అని అన్నారు.

ALSO READ: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
తాజా కథనాలు