/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Srinivas-jpg.webp)
BJP :కర్ణాటక(Karnataka) బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్(V Srinivasa Prasad) (76) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చామనగర్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ 6సార్ల ఎంపీగా గెలిచారు. మైసూరు జిల్లాలోని నంజన్‌గుడ్ నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలే తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకున్నానని ప్రకటన చేశారు.
Also read: రైల్వేశాఖ సరికొత్త ప్లాన్.. త్వరలో వందే మెట్రో
1976లో బీజేపీలో చేరిన ఆయన.. 1979లో కాంగ్రెస్(Congress) లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొంతకాలం పాటు జేడీయూ, జేడీఎస్, సమతా పార్టీల్లో కూడా పనిచేశారు. 1999 -2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీనివాస ప్రసాద్.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 2016లో బీజేపీలో చేరారు. 2019లో చామరాజనగర్ నుంచి ఎంపీగా గెలిచారు.
Also Read: ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల