Raja Singh: 'చంపేస్తా'.. సొంత పార్టీ నేతలకు రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. ఎన్నికల నేపథ్యంలో సొంత మనుషులే తనను మోసం చేస్తున్నారని ఆరోపించారు గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించినవని, తనను మోసం చేస్తే చంపేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 16 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP MLA Raja Singh: గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ మరోసారి సంచలనంగా మారారు. సొంత పార్టీ నేతలను చంపేస్తానంటూ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా గోషామహల్ (Goshamahal) నియోజకవర్గం పరిధిలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ (Raja Singh) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించిన ఎన్నికలని.. తనను మోసం చేస్తే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టనని హెచ్చరించారు. అంతేకాదు.. చంపేందుకు కూడా వెనుకాడబోనంటూ తీవ్ర స్వరంతో సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తన వ్యూహాలను సొంత మనుషులే తన ప్రత్యర్థులకు చేరవేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. 2018 లోనూ తనను ఓడించటానికి ప్రయత్నించిన వారి లిస్ట్ తన వద్ద ఉందన్నారు రాజాసింగ్. ఇప్పుడు ఎవరెవరు తన ప్రత్యర్థులతో టచ్‌లో ఉన్నారో కూడా తెలుసునని, వారి సంగతి తరువాత చూసుకుంటానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. ప్రస్తుతం, ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని.. ధర్మాన్ని గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాజాసింగ్. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజాసింగ్.. రాజాసింగ్ ను ఓడిస్తామంటున్న బీఆర్ఎస్.. మరోవైపు గోషామహల్ లో రాజాసింగ్ ను ఇసారి ఓడించి తీరుతామని అంటున్నారు బీఆర్ఎస్ (BRS) నేతలు. ఇటీవల మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) సైతం రాజాసింగ్ ను ఓడిపోతున్నారు చూడండి అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో కామెంట్స్ చేశారు. ఆయనే కాదు.. గజ్వేల్, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్, కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి సైతం ఓడిపోతారని అన్నారు. Also Read: మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు.. ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..! #brs #congress #bjp #telangana-elections-2023 #mla-raja-singh #goshamahal-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి