MLA Raja Singh : ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ(Congress Party) పై తమ యుద్ధం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) అన్నారు. ఆరు గ్యారంటీ స్కీమ్ లను ఎంత వరకు అమలు చేస్తారో చూస్తామన్నారు. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలుకి కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తెస్తారా? లేదంటే ఇటలీ నుంచి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో రాజాసింగ్ మాట్లాడారు.
ALSO READ: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
"6 గ్యారంటీ స్కీమ్స్ తో కాంగ్రెస్ ఎన్నిక లకు వెళ్లింది. వాటిని పబ్లిక్ కూడా నమ్మారు. ఆ గ్యారంటీలు అమలు చేసే వరకు మా యుద్ధం ఉంటుంది. అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పాం. కొత్త స్పీకర్ ముందు ప్రమాణం చేశాం". అని రాజాసింగ్ చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. మ్యానిఫెస్టో ను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు నెరవేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని వెల్లడించారు.
ప్రగతి భవన్ ను అంబేద్కర్ స్టడీ సెంటర్ చేసి ఐఏఎస్, ఐపీఎస్ లకు ట్రైనింగ్ ఇస్తామని ముఖ్యమంత్రి గతంలో అన్నారని పేర్కొన్నారు. కానీ డిప్యూటీ సీఎంకి క్యాంప్ ఆఫీస్ గా కేటాయించారని ఫైర్ అయ్యారు. రైతుబంధు మళ్లీ పాత పద్దతిలోనే ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోని విస్మరించిందని మండిపడ్డారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. "ఎన్ని కల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు. ఎకరాకు 15 వేల రైతు బంధు ఇస్తామన్నారు. కానీ ఈ సీజన్ కి 5 వేలు మాత్రమే ఇస్తున్నారు. అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
ALSO READ : విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్