Etela: చీటర్ మోదీ కాదు మీ అయ్య - కేటీఆర్ పై ఈటల ఇంకా ఏమన్నారంటే?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాలు మరింత హాట్ హాట్ మారాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది. ప్రధాని మోదీ ప్రసంగంపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రధానిని రావణాసురునితో పోల్చుతూ..చిల్లరగా మాట్లాడుతున్నారంటూ మండిపట్టారు. చీటర్ మోదీ కాదు మీ అయ్య అంటూ కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈటెల రాజేందర్.

Etela: చీటర్ మోదీ కాదు మీ అయ్య - కేటీఆర్ పై ఈటల ఇంకా ఏమన్నారంటే?
New Update

Etela Rajender : దేశప్రధానిపై కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) మాట్లాడిన మాటలకు ప్రజల తలదించుకుంటున్నారన్నారు. ప్రధాని రాకపై ఫ్లెక్సీలు పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని రావణాసురునితో పోల్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పై ఈటెల మండిపడ్డారు. ఇలాంటి సీఎం మన రాష్ట్రానికి ఉన్నందుకు ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. ఇలాంటి గ్లోబల్ ప్రచారం చేయడంలో కేసీఆర్ ను మించినవారు ఇంకేవ్వరూ లేరన్నారు.

కేటీఆర్ పై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏమన్నాంటే...ప్రధానిని (Modi) టూరిస్ట్ అంటావా? నువ్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నావు నీవ్ టూరిస్టు కావా? మహారాష్ట్రలో ఔట్ డేటెడ్ పోలిటిషన్స్ తీసుకొని కండువా కప్పుతున్న కేసిఆర్...ప్రగతి భవన్ లో కండువా కప్పడం ఏంటి? చీటర్ మోడీ కాదు మీ అయ్య చీటర్ అంటూ మండిపడ్డారు. 2014 నుంచి 2018 వరకు మోడీ తో సన్నిహితంగా ఉంది వాస్తవం కదా? అని ప్రశ్నించారు. పైరవీ చేసి 2018 ఎన్నికలకు వెళ్లిన విషయం గుర్తులేదా అంటూ నిలదీశారు. 2018 లో నరేంద్ర మోడీకి భయపడే ముందస్తు కి వెళ్ళిన కేసిఆర్ ..ఆ ఎన్నికలకు మోడీ సహకారం తీసుకోలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ ఫోటోలతో ఫ్లెక్సీలు నింపుతారు.. ఫోటోలో మీరు ఉంటే.. మేము ప్రజల్లో గుండెల్లో ఉన్నాం అని ఈటెల రాజేందర్ అన్నారు.

ఇది కూడా చదవండి: కేంద్ర బలగాలను రప్పించండి.. ఇక్కడి వారిపై నమ్మకం లేదు: సీఈసీకి ప్రతిపక్షాల వినతి..!!

నా నియోజక వర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదు..పథకాలు ఇస్తామని గులాబీ కండువా కప్పుతున్నారు..ఎన్నికల కోసమే గృహ లక్ష్మి పథకం , గృహ లక్ష్మి డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి ? అంత టైం ఉందా? దుబ్బాక లో బీజేపీ (BJP) ఎక్కడిది అన్నావు ..మరేమైంది? 600 కోట్లు ఖర్చు పెట్టిన హుజూరాబాద్ గెలవలేదు. దళిత సీఎం , దళితులకు ముడేకరాలు, దలిత బందు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది మీరు. మీరే పెద్ద చీటర్...తెలంగాణ నీ అబ్బా జాగీరు కాదు కేసిఆర్..ఖర్చు పెట్టేది అంత ప్రజల డబ్బులే అంటూ దుమ్మెత్తిపోశారు ఈటెల రాజేందర్.

కర్ణాటక ఎన్నికలకు డబ్బులు పంపింది మీరు కాదా? మీకే ఇంటెలిజెన్స్ ఉందా? మాకు లేవనుకున్నారా? రాష్ట్రాన్ని నడిపే మీకే ఇంత ఉంటే? దేశాన్ని నడిపే మాకెంత ఇంటెలిజెన్స్ ఉంటాది? చీమ చిటుక్కున్నా మాకు తెలుస్తుంది. మీ తర్వాత మీ కుటుంబ సభ్యులే సీఎం లా? మీ పార్టీ బ్రతికినంత కాలం సీఎం ఎవరు ? ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు? మీలా మోడీకి కొడుకులు లేరు . అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీరు చేసే వాటి అన్నింటికీ లెక్కలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి.రేవంత్ మతిలేని మాటలు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా? కేసిఆర్ మోసాల గురించి ప్రజలందరికీ తెలిసింది. మళ్ళీ అధికారంలోకి రాలేము అనే ప్రెస్టేషన్ లో కేసిఆర్ మాట్లాడుతున్నారు. గతంలో గజ్వేల్ లో జరిగిన మిషన్ భగీరథ పథకం ప్రారంభం లో కేసిఆర్ ప్రధానిని పొగుడుతూ ... మాట్లాడిన వీడియోను చూపించారు ఈటెల రాజేందర్.

ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు

నాలుగు ఏళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా నేషనల్ హైవే విషయంలో ప్రధానిని పొడిగిన కేసిఆర్ ...మోడీ వచ్చాక రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత పెరిగింది..వీటి కోసం తెలంగాణ కు వేల కోట్లు కేటాయించిన మోడీ..విశ్వాసగతానికి మారు పేరు కేసిఆర్ అని మోడీ చెప్పారు..అందులో తప్పేముంది. కవిత గెలిస్తే 100రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇవ్వలేదా? ధర్నా దీక్షలు చేసినా ఆ మాటను నిలబెట్టుకోలోని వ్యక్తీ కేసిఆర్ ...మోడీ ఎప్పుడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ గురించి చెప్పలేదు. అయినా 6300కోట్లతో పున ప్రారంభించారు.

యూపీఏ హయాంలో జంక్షన్ అయిన సిద్దిపేట రైల్వే లైన్ ...మోడీ వచ్చాకే పనులు పూర్తి అయ్యాయి . సీఎం ఫోటో లేకుంటే అధికారులను అడగాలి. కానీ ప్రధాని ఫ్లెక్సీలు చించి మోడీ ఫోటోను తన్నుతారా? మరి రేషన్ ఇచ్చేది కేంద్రం కదా? అక్కడ ఎక్కడ మోడీ ఫోటో పెట్టారు కానీ మీ ఫోటో పెట్టుకుంటారు. చివరికి అయుష్మాన్ భారత్ పై కూడా కేసిఆర్ ఫోటో లు పెడుతున్నారు. మీ సంస్కారం కు మీ కార్యకర్తలే సిగ్గుపడుతున్నారంటూ ఈటెల మండిపడ్డారు. అవి అన్నీ ప్రజల డబ్బులే తప్ప ఎవరి జాగీరు కాదు కేసీఆర్..ఒక సైకో ను తీసుకొచ్చి హుజురాబాద్ ప్రజలను హింసిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల ఖర్చు పెంచండి.. ఆ గుర్తులు తొలగించండి: ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే..!!

#ktr #kcr #bjp #narendra-modi #brs-party #telangana-politics #etela-rajender
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe