Alleti Maheshwar Reddy: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్‌తో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హెచ్చరించారు.

New Update
Alleti Maheshwar Reddy: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ హైకమాండ్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని అన్నారు. నేను కోమటి రెడ్డిని అడుగుతున్నా.. మీరు అమిత్‌షా, గడ్కరీని కలిసి షిండే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. బిడ్డా కోమటిరెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు మాతో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

Also Read: బీజేపీ మేనిఫెస్టో కమిటీ ప్రకటన.. అధ్యక్షుడు ఎవరంటే?

అయితే ఆ ఐదుగురు మంత్రులు ఎవరనే విషయాన్ని మహేశ్వర్ రెడ్డి వెల్లడించలేదు. మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ' మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడూ అంటూ' హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడురు. ముర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాలని ధ్వజమెత్తారు. మహేశ్వర్ రెడ్డి చెప్పిన మాటలు ఆడిందే ఆట పాడిందే పాట అన్న సామెతా ఉన్నంటూ ఎద్దేవా చేశారు.

Also Read: వాషీంగ్‌ పౌడర్‌ నిర్మ.. ఎన్డీయేలో చేరగానే ఆ నేతపై కేసులు ఎత్తేశారుగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు