త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టిన బీజేపీ సీఎంలు.... షాక్ ఇచ్చిన ట్విట్టర్...! బీజేపీ నేతలకు ఎక్స్(గతంలో ట్విట్టర్) షాక్ ఇచ్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు మువ్వన్నెల జెండాను తమ డీపీగా మార్చుకోగా ఆయా నేతల ట్విట్టర్ గోల్డెన్ టిక్ మాయమైంది. దీంతో కాషాయ పార్టీ నేతలు అయోమయానికి గురయ్యారు. ఆ జాబితాలో ప్రముఖ నేతలతో పాటు పలు రాష్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. By G Ramu 14 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి బీజేపీ నేతలకు ఎక్స్(గతంలో ట్విట్టర్) షాక్ ఇచ్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు మువ్వన్నెల జెండాను తమ డీపీగా మార్చుకోగా ఆయా నేతల ట్విట్టర్ గోల్డెన్ టిక్ మాయమైంది. దీంతో కాషాయ పార్టీ నేతలు అయోమయానికి గురయ్యారు. ఆ జాబితాలో ప్రముఖ నేతలతో పాటు పలు రాష్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమంలో భాగంగా దేశంలోని పౌరులంతా భారత జాతీయ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ పౌరులంతా జాతీయ పతాకంతో సెల్ఫీలు దిగి ‘హర్ ఘర్ తిరంగా(https://harghartiranga.com)వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ప్రధాని కోరారు. ప్రధాని ఇచ్చిన పిలుపునకు భారీగా స్పందన వస్తోంది. ఇప్పటికే చాలా మంది పౌరులు త్రివర్ణ పతాకాన్ని తమ డీపీగా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఆ క్రమంలో పలువురు బీజేపీ నేతలు కూడా త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో వారి గోల్డెన్ టిక్ మాయం అయింది. గోల్డెన్ టిక్ కోల్పోయిన ముఖ్యమత్రుల్లో యోగీ ఆదిత్య నాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వున్నారు. వారితో పాటు గోవా సీఎం ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ గోల్డెన్ టిక్స్ మాయం అయ్యాయి. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థకు సంబంధించి అసలైన అకౌంట్ అదే అనే గుర్తింపు కోసం ట్విట్టర్ లో గోల్డెన్ టిక్ కేటాయిస్తారు. ఇటీవల జాతీయ పతాకాన్ని డీపీగా పెట్టిన బీసీసీఐకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. #bjp #bcci #cm-yogi-aditya-nath #pushkar-singh-dhami #har-ghar-thiranga #himantha-biswa-sharma #pramod-savanth #shiv-raj-singh-chowhan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి