Etela Rajender : తెలంగాణ(Telangana) రాజకీయాల్లో గత పదేళ్లలో చూడని ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్(Congress) నేతలు మైనంపల్లి హనుమంత రావు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి(Patnam Mahender Reddy) తో బీజేపీ(BJP) నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) భేటీ అయ్యారు. ఒక చోట కలిసి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ లోకి ఈటల?
గత కొద్దీ రోజులుగా ఈటల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. తాజగా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యి చాలా సేపు చర్చలు జరపడంతో త్వరలో ఆయన కమలం పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చర్చ జోరందుకుంది. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వార్తలు రాగ ఆర్టీవీ(RTV) కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఏ పార్టీలో చేరడం లేదని బీజేపీలోనే ఉంటానని స్పష్టం ఇచ్చారు.
అందుకే కలిశారు...
త్వరలో కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ చేరుతారనే చర్చకు.. అలాగే కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంపై ఈటల వర్గం క్లారిటీ ఇచ్చింది. పార్టీ మారుతారని వస్తున్న వార్తలను ఖండించింది. కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గృహ ప్రవేశంలో అందరూ కలిశారని.. అంతే కానీ రాజకీయాలపై చర్చలు చేసేందుకు కాదని వివరణ ఇచ్చింది. అయితే.. దీనిపై ఈటల రాజేందర్ ఇప్పటికి స్పందించక పోవడంతో పార్టీ మారనునట్లు జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోంది.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ రోజే కోర్టుకు వస్తా: కేజ్రీవాల్!
బండి v/s ఈటల?
తెలంగాణ బీజేపీ పార్టీలో బండి సంజయ్(Bandi Sanjay), ఈటలకు అసలు పడడం లేదని ఆ పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరీంనగర్ ఎంపీ టికెట్ కోసమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఈటల రాజేందర్.. అలాగే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగి ఓడిన బండి సంజయ్ ఇద్దరు కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారట. అయితే.. బీజేపీ అధిష్ఠానం మాత్రం బండి సంజయ్ కే ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ రాదని భావించిన ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈటల బీజేపీలో ఉంటారా? లేదా? అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read : ఆ ఆలోచనే కేసీఆర్‌దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్‌రెడ్డి