వారి అండ చూసుకునే రెచ్చిపోతున్న పోలీసులు: బీజేపీ నేత!

వైసీపీ నేతలు అండ చూసుకుని ఏపీ పోలీసులు రెచ్చిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అండతో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

వారి అండ చూసుకునే రెచ్చిపోతున్న పోలీసులు: బీజేపీ నేత!
New Update

వైసీపీ నేతలు అండ చూసుకుని ఏపీ పోలీసులు రెచ్చిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసుల అండతో ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భీమవరంలోని సోమేశ్వర్‌ స్వామి ఆలయంలో పూజారి పై వైసీపీ నేతలు దాడులు చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు.

అదే అన్యమతస్థుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం ఇలాగే పట్టించుకోకుండా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నుంచి కనీసం పోలీసులుకు జీతాలు కూడా రావడం లేదన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని ఆయన అన్నారు. వైసీపీకి జగన్‌ జీవిత కాల అధ్యక్షుడు కాదని..ఇది పోలీసులు గుర్తించాలని హితవు పలికారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ స్పందించాలని.. ప్రభుత్వాని వివరణ కోరాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ ను ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదన్నారు. పోలవరాన్ని సీఎం జగన్ పూర్తి చేయలేరని ఆయన వ్యాఖ్యలు చేశారు.ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజేక్ట్‌ను కేంద్రానికి అప్పగిస్తే బీజేపీ పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ తరుపున వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. సోమువీర్రాజు మాట్లాడితే వైసీపీ స్క్రిప్ట్ అని... పురందేశ్వరి మాట్లాడితే టీడీపీ స్క్రిప్ట్ అని అంటున్నారన్నారు.

నిజంగా వాలంటీర్ల గురించి ఆలోచించే ప్రభుత్వమే అయితే, నిజంగా ప్రభుత్వానికి బాధ్యత రావాలంటే 2.5 లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తీసేశారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

#bjp #andhrapradesh #jagan #vishnu-vardhan-reddy #police #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe