Kishan Reddy: బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్లే.. అదో ఔట్ డేటెడ్ పార్టీ: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ. లోక్ సభ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్టే అన్నారు. అలాగే కాంగ్రెస్ , బీఅర్ఎస్ నాయకులను దొంగలు గజ దొంగలుగా పేర్కొన్నారు.

New Update
Kishan Reddy: బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్లే.. అదో ఔట్ డేటెడ్ పార్టీ: కిషన్ రెడ్డి

Kishan Reddy: బీఆర్ఎస్ (BRS) పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఇకపై బీఅర్ఎస్ హవా ఉండదని, అది ఔట్ డేటెడ్ పార్టీగా పేర్కొన్నారు. ఫార్మ్ హౌస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్టే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి ఎంపీలు గెలిచిన ఢిల్లీ (Dellhi)లో చేసేదేమీ లేదన్నారు.

అలాగే కాంగ్రెస్ (Congress)  ప్రభుత్వంపై కూడా విమర్శల దాడికి దిగారు. కాలయాపన కోసమే రేషన్ కార్డు (Ration card) దరఖాస్తులు తీసుకుంటోందని, పథకాలను అందించేందుకు రేషన్ కార్డ్ తప్పని సరి చేయడం ఎమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో జైల్ కు వెళ్లి అరెస్ట్ అయిన వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి కదా.. వీటిని డీజీపీ కి ఆదేశించి వివరాలు తెప్పించవచ్చు కదా.. అప్లికేషన్ ఎందుకని అడిగారు. అలాగే 2500 ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదని, సిలిండర్ ఇచ్చేందుకు సివిల్ సప్లై వద్ద డేటా ఉందని గుర్తు చేశారాయన. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఎందుకని, రైతులకు కేంద్రం కిషాన్ సమ్మన్ నిధి డబ్బులు జమ చేస్తుందని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు డేటా ఉన్నపుడు అప్లికేషన్స్ ఎందుకని అడిగారు. ఉపాధి హామీ డేటా ప్రభుత్వం వద్ద ఉంది. దరఖాస్తు అడగటం వెనకున్న మర్మమేమిటి? పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన కోసమే అప్లికేషన్ నాటకాలు. ఇది ప్రజలను కష్టపెట్టే అప్లికేషన్స్. మీరు హామీలు ఎప్పుడు ఇచ్చిన సరే కానీ.. ప్రజలను అనవసరంగా ఆఫీస్ చుట్టూ తిప్పి ఇబ్బందులు పెట్టొద్దని కోరారు.

ఇది కూడా చదవండి : Amala Paul: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఎట్టకేలకు బేబీ బంప్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ

ఇక కాంగ్రెస్ ప్లీనరీలో మోడీ (Modi) మెడిసిన్ ఎక్స్పైర్ అయిందని చెప్పిన రేవంత్ కామెంట్స్ పై స్పందించిన కిషన్ రెడ్డి.. మోడీ మెడిసిన్ ఎలా ఎక్సై్‌ర్ అయిందో రేవంత్ చెప్పాలని కోరారు. రాహుల్ ఉన్నంత కాలం మోడీ మెడిసిన్ ఎక్ష్పైర్ కాదు. రాహుల్ గాంధీ ఫార్ములా నే రిజెక్ట్ అయింది. ఇంకా మెడిసిన్ ఎక్కడ వస్తది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదు.. బీఅర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వచ్చాయని, అన్ని పార్టీలు వ్యక్తం చేసిన బాధ తెలుసన్నారు. నేను న్యాయ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తు అడిగాను. గుమ్మడికాయ దొంగల కాంగ్రెస్ నాయకులు ఎగిరి ఎగిరి పడుతున్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుని హోదాలో రేవంత్ సీబీఐ దర్యాప్తు కి లేఖ రాశారు. పార్లమెంట్ సభ్యులు సీబీఐ ఎంక్వైరీ అడిగితే జరగలేదు. సీఎం సీబీఐ దర్యాప్తుకు లేఖ రాయాలని, ఇప్పుడు రేవంత్ సీఎం కదా ఆయనే లేఖ రాయకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారెందుకని అడిగారు. సీఎం హోదాలో ఇప్పుడు లేఖ రాస్తే అవినీతిపై తప్పకుండా సీబీఐ దర్యాప్తు జరుగుతుందని, అధికారం లేనప్పుడు ఒక్కమాట అధికారం కోల్పోయాక మరొక్క మాట మాట్లాడటం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అంటూ దూషించారు.

అలాగే రేవంత్ (Revanth) అహంకారంగా మాట్లాడుతున్నారన్న ఆయన.. రేవంత్ మాటనే నేను పునరుద్ధరణ చేస్తున్న. జ్యుడీషియల్ ఎంక్వైరీ పేరుతో కేసిఆర్ ను కాపాడాలని ప్రయత్నం చేస్తే నేనేం చేయలేను. బీ అర్ఎస్ నాయకుడు పుట్టింది మీ పార్టీలోనే. మీకు బీజేపీనీ ప్రశ్నించే నైతిక హక్కు లేదు. ఎవరు ఏ రకమైన ఆదాయం సంపాదించారనేది ( రేవంత్ వ్యాఖ్యలను కోడ్ చేస్తూ) ప్రజలందరికీ తెలుసు. నా ప్రస్థానం ఎలా మొదలైందో.. సీఎం ప్రస్థానం ఎలా మొదలైందో అందరికీ తెలుసు. వ్యక్తిగత దాడులకు నేను వ్యతిరేకం. సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడతారా? నా ఆదాయం ఎంతో.. ఆయన ఆదాయం ఎంతో నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కాళేశ్వరంలో బీజేపీ కమీషన్ తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే.. దమ్ముంటే నిరూపించాలనక్నారు. సీఎం లంకె బిందెల కోసం అధికారంలోకి వచ్చావే? బొగ్గు కుంభకోణం, 2g కుంభకోణం , నేషనల్ హెరాల్డ్ కేస్, కామన్వెల్త్ కుంభకోణం చేసింది మీ గజ దొంగ పార్టీ కాడా అని మండిపడ్డారు. మోడీ గజ దొంగల పార్టీ యముడు. 15 రోజుల్లోనే ఫార్మసీటిపై మాట ఎందుకు మార్చారు? ఇంత తొందరగా యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు? ఫార్మా కంపెనీలు యజమానులు వచ్చి కలిసినందుకే వెనక్కి తగ్గారా? ఫార్మా కంపెనీల లాబియింగ్ కి భయపడ్డారా? లొంగిపోయారా? అని ప్రశ్నించారు. చివరగా కాంగ్రెస్ , బీఅర్ఎస్ దొంగలు గజ దొంగలుగా పేర్కొన్న కిషన్ రెడ్డి అంబర్ పేట్ లో మూడు సార్లు కేటీఆర్ పార్టీని ఒడించానని గుర్తు చేశారు.

Advertisment
తాజా కథనాలు