Telangana BJP: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ స్పీడ్ పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ దుమ్ము రేపుతున్నాయి. తాజాగా కల్వకుర్తి పట్టణలో బీజేపీ(BJP) విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న డీకే అరుణ(DK Aruna).. సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌పై, అటు కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిజెపి మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు డీకే అరుణ. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి వెళ్లారని.. ముందు మీ ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టి కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యే లు బిఆర్ఎస్ లోకి వెళ్లరని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
కేసీఆర్, కేటీఆర్ నిండు ఆశీర్వాదంతోనే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డికి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆచారి బలం తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం పంచుకోవాలనే ఓట్లు చీల్చాలనే దురుద్దేశంతో ఎమ్మెల్సీ కసిరెడ్డికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు డీకే అరుణ. నరేంద్ర మోదీ తెలంగాణ పల్లెలు పట్టణాలను అభివృద్ధి చేయడానికి రూ. 9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇస్తే.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుల పేరుతో, పథకాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తుందని ఆరోపించారు. చివరకు బతుకమ్మ చీరలపై కూడా దోపిడీ చేస్తుందని, ఆ నాసిరకం చీరలను కేసీఆర్ బిడ్డకు బహుమతిగా పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె ఉన్నన్ని రోజులు ఆ చీరలు కట్టుకుంటుందని సెటైర్లు వేశారు. కేసీఆర్ వంటి వారు ముఖ్యమంత్రిగా ఉంటే.. ప్రజలు ప్రతిసారి మోసపోవాల్సి ఉంటుందని అన్నారు. 'పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం దగ్గర శంకుస్థాపన చేసినప్పుడు తాను ఇక్కడ కుర్చీ వేసుకుని కాపలా కుక్కలా ఉంటా అన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడు మరి ఈ కేసీఆర్.' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు డీకే ఆరుణ.
ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి 25 వేలకోట్లు ఉన్న అంచనా వ్యయాన్ని 60 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కడితే పాలమూరు పచ్చగా అవుతుందని చెప్పి.. చివరకు ఆ రిజర్వాయర్‌నే లేకుండా చేశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 37 మోటార్లకు ఒక్క మోటారు ప్రారంభించి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం పూర్తయినట్టుగా నమ్మించి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి తీరుని జనాలు అర్థం చేసుకోవాలన్నారు. చివరకు రైతులకు వ్యవసాయ సామాగ్రిపై ఎరువులపై వచ్చే సబ్సిడీని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసిందని ఆరోపించారు. 'కల్వకుర్తి ప్రజలు ఈ కేసీఆర్, కాంగ్రెస్ వాళ్లు చెప్పే మాటలు నమ్మకుండా మీ ఓటును బిజెపికి వేసి ఆచారిని గెలిపించాలి' ప్రజలకు పిలుపునిచ్చారు డీకే అరుణ.
ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా