Telangana BJP: ఎన్నికల్లో పోటీ చేయను.. కారణమిదేనన్న డీకే అరుణ..

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, తెలంగాణ నాయకురాలు డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. అంతేకాదు.. బీజేపీ నినాదం మేరకు గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని నిలబెడతామన్నారు.

New Update
DK Aruna: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: డీకే అరుణ

DK Aruna: తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ(Assembly Elections) బరి నుంచి ఆమె తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించానని చెప్పారు. గత కొద్ది రోజులుగా డీకే ఆరుణ(DK Aruna) బీజేపీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో తన పోటీపై క్లారిటీ ఇచ్చారు డీకే అరుణ. అసెంబ్లీలో పోటీ చేయనని అన్నారు. బీసీ సీఎం నినాదం నేపథ్యంలో తన గద్వాల స్థానం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెడుతున్నామని ప్రకటించారు.

ఇదే విషయమైన బుధవారం మీడియా ముందుకు వచ్చిన డీకే అరుణ.. రాష్ట్ర రాజకీయాలపై, తన పోటీపై సంచలన కామెంట్స్ చేశారు. 'అసెంబ్లీలో పోటీ చేయను అని నేను గతంలోనే చెప్పాను. బీసీ సీఎం నినాదం నేపథ్యంలో నా గద్వాల స్థానం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెడుతున్నాం. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి, కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. బలహీన వర్గాల నుంచి సీఎంను చేస్తామని బీజేపీ చెబుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే.. అది బీజేపీతోనే సాధ్యం అని ప్రజలు భావిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక స్థితి, ప్రజల జీవన స్థితి మెరుగుపడుతుంది. కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇస్తూ తెలంగాణను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పాలన జనం ఆల్రెడీ చూశారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. విలువలతో కూడుకున్న రాజకీయం బీజేపీ చేస్తుంది. ఇదివరకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరారు.' అని చెప్పుకొచ్చారు డీకే అరుణ.

Also Read:

సక్సెస్ జర్నీ అంటే ఇలా ఉండాలి కదా! దటీజ్ ‘గంగవ్వ’!

జాబ్ ఉండాలంటే వారికి కిస్ చెయ్యాల్సిందే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు