Karnataka : కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో కేసులో బీజేపీ నేత అరెస్ట్

కర్ణాటకలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ హెచ్డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరో బీజేపీ నేత న్యాయవాది జి. దేవరాజేగౌడను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.

New Update
Karnataka : కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో కేసులో బీజేపీ నేత అరెస్ట్

Sex Scandal Case : సెక్స్ స్కాండల్(Sex Scandal) కర్ణాటక(Karnataka)ను ఓ కుదుపు కుదిపేసింది. మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు, మనుమడు ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో 300 వేలకు పైగా వీడియోలు బయటపడ్డాయి. ఇందులో దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.ఇ తను వందల మంది ఆడవారిని లైంగికంగా హింసించడమే కాకుండా.. వాటిని వీడియోలుగా కూడా తీశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే కేసు విషయం బయటపడగానే ప్రజ్వల్ దేశం నుంచి పారిపోయాడు. అతను ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రజ్వల్ మీద లుక్‌ అవుట్ నోటీసులుకూడా జారీ చేశారు.

మరోవైపు దేవెగౌడ కొడుకు...సెక్స్ స్కాండల్‌ కేసులో మరో నిందితుడు అయిన హెచ్డీ రేవణ్ణను సిట్ అధికారలు వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో బీజేపీ నేత దేవరాజెగౌడ్‌(Devaraj Goud) ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పెన్ డ్రైవ్‌లో అశ్లీల వీడియోలను లీక్ చేశారనే ఆరోపణలపై హసన్ పోలీసులకు అందిన నిఘా సమాచారం మేరకు చిత్రదుర్గ జిల్లా పోలీసులు గులిహాల్ టోల్ గేట్ వద్ద దేవరాజేగౌడ్‌ను అరెస్టు చేశారు. అయితే దేవెరాజగౌడ్‌కు ఈ కేసుతో ఏమీ సంబంధం లేదు. కానీ ఆయన ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ వీడియోలను లీక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హోలెనరసిపుర నుంచి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై దేవెరాజగౌడ్ పోటీ చేశారు.

ప్రజ్వల్ పై మరో కేసు...

సెక్స్ స్కాండల్‌లో ప్రధాన నిందితుడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ మీద ఇప్పటికే రెండు కేసులునమోదు అయ్యాయి. ఇప్పుడు మరో కేసును కూడా బుక్ చేశారు సిట్ అధికారులు. మే 8న బెంగళూరులో ప్రజ్వల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. ప్రజ్వల్ రేవణ్ణ పదేపదే అత్యాచారం, క్లిప్‌లు తయారు చేయడం, లైంగిక సంబంధాలను డిమాండ్ చేయడం, బట్టలు పట్టుకుని లాగడం, వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉన్నాడు. ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.

Also Read:Elections: వీటిల్లో ఏది ఉన్నా ఓటేయొచ్చు..

Advertisment
తాజా కథనాలు