/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Amith-Shah-1-jpg.webp)
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో యూనిఫామ్స్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు అమిత్ షా. ఇది ప్రధాని మోదీ ఇచ్చిన హామీ అని తప్పకుండా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆయన గౌహతిలోని ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అకకడ జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ యూనిఫామ్స్ సివిల్ కోడ్ గురించి చెప్పారు. సివిల్ కోడ్ గురించి తాము మేనిఫెస్టోలో కూడా ప్రకటించామని...అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు అవుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం యూసీసీ అమల్లో ఉందని...అక్కడలాగే దేశం మొత్తం చేస్తామని చెప్పుకొచ్చారు. దేశంలో నక్సలిజం, ఉగ్రవాదాన్ని మోదీ ప్రభుత్వం అంతం చేసిందని అన్నారు.
BJP in favour of implementing Uniform Civil Code across India: Amit Shah in Guwahati
— Press Trust of India (@PTI_News) April 30, 2024