Loksabha Elections: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ కసరత్తులు.. నేడు ఢిల్లీలో పార్టీ నేతలతో కీలక సమావేశం..

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఇందుకోసం ఢిల్లీలోని పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Loksabha Elections: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ కసరత్తులు.. నేడు ఢిల్లీలో పార్టీ నేతలతో కీలక సమావేశం..
New Update

మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక బీజేపీ అయితే మూడోసారి అధికారం దక్కించుకనేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం లోస్‌సభ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల కోసం పార్టీ నేతలు పాటించాల్సిన వ్యూహాలపై సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికాలు కూడా రూపొందించారు.

Also Read: ఎంపీ బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్..కొనసాగుతున్న మాటల యుద్ధం.!

ఐదు క్లస్టర్లుగా విభజన

ఇందులో పార్లమెంట్‌ ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయన్న సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఈ 17 పార్లమెంట్‌ స్థానాలను మొత్తం 5 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్‌కి ఒక్కో నేతకు ఇంఛార్జిగా బాధ్యతలను అప్పజెప్పనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.

సమావేశానికి జేపీ నడ్డా

అయితే ఈ సమావేశానికి హాజరయ్యే నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా రానున్నారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ క్లస్టర్ ఇంఛార్జీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌తో సహా.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ఇక బుధవారం నుంచి బీజేపీ అభ్యర్థులగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు.

Also Read: పల్లెబాట పట్టిన పట్నం…హైదరాబాద్ రోడ్లన్నిఖాళీ

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా అసెంబ్లీలను విభజించారు. ముందుగా మొదటి స్థానంలో నిలిచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థులతో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులతో మరో సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో అభ్యర్థులతో జేపీ నడ్డా కూడా భేటీ కానున్నారు. ఇక మరో విషయం ఏంటంటే చేరికల కమిటీ వేసిన బీజేపీ.. ఆ కమిటీ సమన్వయకర్తగా చింతల రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు.

#telugu-news #national-news #jp-nadda #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe