పార్లమెంటులో లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు బడ్జెట్‌పై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలో మౌలిక సదుపాయాలను కంట్రోల్ చేస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే సభలో వ్యాపారవేత్తల పేర్లు ప్రస్తావించడంపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల వాదనలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాహుల్ గాంధీకి సభా నియమాలు తెలియవంటూ విమర్శలు గుప్పించారు. దీనికి బదులిచ్చిన రాహుల్.. అధికార పక్ష నేతల వ్యవహారశైలికి అనుగణంగానే తాము స్పందిస్తామని తేల్చి చెప్పారు.
Also Read: Jio, Airtelకు బిగ్ షాక్.. BSNLకు మారిన లక్ష మంది యూజర్లు..!
అలాగే 2024 బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను మోసం చేసిందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌ను తొలగించిన ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేయిన్ ట్యాక్స్ (LTCG) పెంచడం దారుణమంటూ ధ్వజమెత్తారు.
Also Read: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. ప్రమాదానికి ముందు విజువల్స్