బీజేపీ ఈసీ భేటీ, 15 మంది సభ్యులతో ప్రధాని మేధోమథనం..!!

త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు  (Assembly Election 2023)జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని నరేంద్రమోదీ (PM Modi) సర్కార్ ఆయా రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మొత్తం 15 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బలహీన స్థానాలపై పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఎన్నికల వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.

New Update
బీజేపీ ఈసీ భేటీ, 15 మంది సభ్యులతో ప్రధాని మేధోమథనం..!!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మోదీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ , మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మొత్తం 15 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఎన్నికల వ్యూహంపై చర్చ:
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బలహీన స్థానాలపై పార్టీని బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన సీట్ల జాబితాను పార్టీ సిద్ధం చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడంతోపాటు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులపై రాష్ట్ర నాయకత్వం తన అభిప్రాయాన్ని తెలియజేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ఇతర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది.

మరోవైపు తెలంగాణలో బీజేపీ దూకుడుపెంచుతోంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి బస్సుయాత్రకు రెడీ అవుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు షురూ చేసింది. గతంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో బస్సుయాత్రకు ఆపార్టీ శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్న ఈ యా్తర అక్టోబర్ 2న ముగిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి పది జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగించాలని భావిస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఈ యాత్రకు సారథ్యం వహిస్తున్నట్లు ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఈ బస్సుయాత్ర తోడ్పడుతుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు