Zomato year end:కుతుబ్ మీనార్ అంత ఎత్తు పిజ్జాలు..భూమిని 22సార్లు చుట్టేసంత నూడుల్స్ తినేశారు

ఇయర్ ఎండ్ అవడంతో పుడ్ యాప్ లు అన్నీ తమ ఏడాది మొత్తం డెలివరీ వివరాలను బయటపెడుతున్నాయి. ఇవి చూస్తుంటే భారతీయులు కేవలం తినడం కోసమే పుట్టారా అని అనిపించకమానదు. అన్ని రకాల ఫుడ్ లనూ తెగ తినేస్తున్నారు.

Zomato year end:కుతుబ్ మీనార్ అంత ఎత్తు పిజ్జాలు..భూమిని 22సార్లు చుట్టేసంత నూడుల్స్ తినేశారు
New Update

2023లో మనవాళ్ళు కిందామీదా పడి తిన్నారు అని చెబుతున్నారు స్విగ్గీ, జొమాటో ఫుడ్ యాప్ ల వాళ్ళు. ఈ ఇయర్ లో పండుగలు, పబ్బాలు, వరల్డ్ కప్ ఇలా...అన్ని రోజుల్లోనూ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేశారు అని లెక్కలు చూపిస్తున్నారు. ఇండియన్, చైనీస్, ఇటాలియన్...మొత్తం ప్రపంచ క్యుసిన్స్ అన్నిటినీ ఒక పట్టు పట్టారుట. మొన్నటికి మొన్న బిర్యానీలు కుమ్మేశారు అని స్విగ్గీ వాడు లెక్కలును చూపిస్తే...ఇప్పుడు జొమాటో వాడు అంతకు మించి వివరాలను బయటపెట్టాడు. ఇందులో కూడా ఫస్ట్ ప్లేస్ లో బిర్యానీనే ఉంది కానీ...ఇటాలియన్ ఫుడ్ అయిన పిజ్జా కూడా దాని కన్నా తక్కువేమీ కాదు అంటున్నాడు. కొన్ని రోజుల్లో బిర్యానీని..పిజ్జా డామినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నాడు.

Also Read:అయోధ్య రాముడు వీఐపీలకే సొంతం..యోగి సర్కార్ షాకింగ్ డెసిషన్

బిర్యానీ లవ్...

జోమాటోలో బిర్యానీని 10.09 కోట్లమంది ఆర్డర్ పెట్టారు. ఫుడ్‌ లవర్స్‌ ప్రతి సెకండ్‌కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్‌ పెట్టారు. వారిలో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్‌లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్‌ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్‌లో ప్రతి 6వ ఆర్డర్‌ ఇక్కడే నుంచే వచ్చిందట.

పిజ్జా ఉంటే చాలు

7.45 మంది పిజ్జాలను ఆర్డర్ పెట్టారుట. ఇలా ఆర్డర్ పెట్టిన పిజ్జాలను ఒక స్టేక్ లా పెడితే కుతుబ్ మీనార్ అంత పొడవు అవుతుందని చెబుతున్నారు. 5 ఈడెన్ గార్డెన్లు పట్టేంత పిజ్జాలు అవుతాయిట. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ పిజ్జాను ఇష్టపడుతున్నారని తమ సర్వేల్లో తేలిందని అంటున్నారు. పైగా డోమినోస్, పిజ్జా హట్ లాంటి వాళ్ళు బాగా ఆఫర్లు కూడా ఇస్తుండండతో వాటినే ఆర్గర్ చేస్తున్నారని చెబుతున్నారు.

నూడుల్స్ తో చుట్టేశారు

ఇక ఇటలీ తరువాత స్థానం చైనాదే...అదేనండీ నూడిల్స్ ది. దేశ వ్యాప్తంగా 4.55 నూడుల్స్ ను ఫుడ్ లవర్స్ ఆర్డర్ పెట్టారుట. టోటల్ మొత్తం కౌంట్ చేస్తే 22సార్లు భూమిని చుట్టడానికి ఈ నూడుల్స్ సరిపోతాయని అంటున్నారు.

కేక్ కేపిటల్

జొమాటో పుణ్యమాని కూల్ సిటీ బెంగళూరు కేక్ కేపిటల్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువగా కేక్ లను ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారుట. జోమాటోలో ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ ను ఆర్డర్ పెట్టుకుంటున్నారని చెబుతున్నారు నిర్వాహకులు. ఒక్క ఢిల్లీ వాళ్ళు మాత్రం అర్ధరాత్రుళ్ళు ఎక్కువగా తిండి తింటున్నారని చెబుతున్నారు. కానీ అందరి కంటే ఎక్కువగా ముంబై వాసులు తెగ తిండేస్తున్నారు అని చెబుతోంది జొమాటో. ఒక్క ఆర్డర్‌ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్‌ ఆర్డర్‌లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్‌లు పెట్టారు. ఈ ప్రాంతం నుంచి ఏడాది మొత్తం వరకు 3,580 ఆర్డర్‌లు రాగా.. రోజుకి కనీసం 9 ఆర్డర్‌లు పెట్టినట్లు జొమాటో హైలెట్‌ చేసింది.

#zomato #biryani #noodles #food #pizza #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe