/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/64-jpg.webp)
Bird Flu Virus Detected : నెల్లూరు జిల్లా(Nellore District) లో బర్డ్ ప్లూ(Bird Flu) భయపెడుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూర మండలం చాటగొట్ల గ్రామంలో రెండు కోళ్ళ ఫారంలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ రెండు ఫారాల్లో వరుసగా కోళ్ళు చనిపోతుండడంతో వాటి శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని భోపాల్(Bhopal) కు పంపించి టెస్ట్చేయగా బర్డ్ ఫ్లూ ఉన్నట్టు తెలిసింది. దీంతో మూడు నెలల పాటూ నెల్లూరులో చికెన్(Chicken) విక్రయాలను నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేశారు. చాటగొట్లకు పదికిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటూ అమ్మకాల మీద కూడా నిషేధం విధించారు. దాంతో పాటూ అక్కడ గ్రామాల్లో శానిటైజేషన్ కూడా చేయిస్తున్నారు.
Also Read : Mumbai:వీల్ ఛైర్ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన
వేలకోళ్ళు మృతి...
చాటగొట్లలో బర్డ్ ఫ్లూతో వేల కోళ్ళు మరణించాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో బాయిలర్, లేయర్, నాటుకోళ్ళు కూడా ఉన్నాయని తెలిపారు. బడర్గ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో చాటగొట్ల, దాని పక్కనున్న గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇన్నాళ్ళు తెలియకుండా చికెన్ తిన్న తమకు ఏమవుతుందో ఆని ఆందోళన చెందుతున్నారు. అయితే బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా అత్యవసర చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ హరినారాయణన్(Hari Narayan) చెబుతున్నారు. పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలాల్లో శానిటైజేషన్ చేయించామని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలని...చాలా అవసరమైతే తప్ప బయట ౠహారం తినొద్దని హెచ్చరిస్తున్నారు.
Also Read : Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!