Impregnate Childless Women: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల రూపాయలిస్తాం.. ఈ న్యూస్‌ మొత్తం తెలుసుకుంటే షాక్‌ అవుతారు!

కడుపు చేస్తే లక్షల రూపాయలిస్తామంటూ ఓ బిహార్‌ గ్యాంగ్‌ కొంతమంది పురుషుల వీక్‌ పాయింట్‌ని క్యాష్‌ చేసుకుంటోంది. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేస్తోంది. ప్రెగ్నెంట్‌చేస్తే రూ.13లక్షలు ఇస్తామంటూ చెప్పడంతో ఎందరో పురుషులను ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయ్యి తమ డబ్బులు పోగొట్టుకున్నారు.

Impregnate Childless Women: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల రూపాయలిస్తాం.. ఈ న్యూస్‌ మొత్తం తెలుసుకుంటే షాక్‌ అవుతారు!
New Update

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రకరకాల ఆఫర్ల పేర్లతో ప్రజల్ని ఊరించి, వారి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. డబ్బులు కొట్టేసేందుకు బిహార్‌(Bihar)కు చెందిన ఒక గ్యాంగ్ దిమ్మతిరిగే మార్గాన్ని ఎంపిక చేసుకుంది. మగవారికి గాలం వేసేందుకు.. ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ పేరుతో పెద్ద రాకెట్‌కే తెరలేపింది. ఎవరైతే మహిళలతో శృంగారంలో పాల్గొని ప్రెగ్నెంట్ చేస్తారో.. వారికి భారీ మొత్తం నగదు అందజేయబడుతుందని ఈ గ్యాంగ్ ప్రచారం చేసింది. కొంతకాలం నడుస్తున్న ఈ రాకెట్‌ని తాజాగా పోలీసులు వెలికితీశారు. ఎనిమిది మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేశారు.

రాకెట్‌ను ఎలా నడిపారంటే..
తొలుత వాట్సాప్(Whatsapp) లేదా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా యువతను సంప్రదిస్తారు. మహిళలకు సుఖాన్ని అందించడంతో పాటు వారిని ప్రెగ్నెంట్ చేస్తే.. రూ.13 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తారు. ఆసక్తి కలవారు తమ పేరుని నమోదు చేసుకోవాలని చెప్తారు. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.799 చెల్లించాల్సి ఉంటుంది. పేర్లు నమోదు చేసుకున్న తర్వాత.. ఈ వ్యవహారం మొత్తం నిజమేనని బాధితుల్ని నమ్మించేందుకు కొన్ని ఫొటోలను వాట్సాప్ చేస్తారు. ఆ ఫొటోల్లో నుంచి నచ్చిన మహిళను ఎంపిక చేసుకోమని చెప్తారు. స్త్రీల అందాన్ని బట్టి రూ.5 వేల నుంచి 20 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేయమని అడుగుతారు. ఆ మొత్తాన్ని జమ చేశాక, నేరుగా మహిళ వద్దకు వెళ్లిపోవచ్చని చెప్తారు. తీరా డబ్బులు డిపాజిట్ చేశాక.. వాళ్లు మాయమైపోతారు. ఇలా ఎందరో పురుషులు ఈ ఆఫర్‌కి టెంప్ట్ అయ్యి తమ డబ్బులు పోగొట్టుకున్నారు.

గుట్టు రట్టు చేసిన పోలీసులు
ఇటీవల ఈ రాకెట్ గురించి తెలుసుకున్న బిహార్ పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, తమదైన శైలిలో విచారణ చేపట్టారు. కొందరు బాధితులు అందించిన సమాచారం మేరకు దర్యాప్తు చేసి.. ఎట్టకేలకు ఎనిమిది మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బిహార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నవాడాలో సోదాలు నిర్వహించిన తర్వాత వారిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై నవాడా పోలీసు సూపరింటెండెంట్ కళ్యాణ్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘మహిళల్ని ప్రెగ్నెంట్ చేసిని వారికి రూ.13 లక్షలు ఇవ్వడం జరుగుతుందని బాధితులకు చెప్పబడింది. ఒకవేళ వారు స్త్రీని గర్భం దాల్చడంలో విఫలమైతే.. రూ.5 లక్షల ఓదార్పు ధరను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ట్రాప్‌లో పడి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు’’ అని చెప్పారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు దేశవ్యాప్తంగా సైబర్ సిండికేట్‌లో భాగమని కళ్యాణ్ ఆనంద్ తెలిపారు.

Also Read: మెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్

WATCH:

#bihar #pregnant #cyber-fraud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe