‘ఇండియా’ కూటమిలోకి మరి కొన్ని పార్టీలు.... నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు...!

విపక్ష ‘ఇండియా’ కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరి కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరనున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. అయితే కూటమిలో ఏయే పార్టీలు చేరబోతున్నాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సీట్ల పంపకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు.

author-image
By G Ramu
‘ఇండియా’ కూటమిలోకి మరి కొన్ని పార్టీలు.... నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు...!
New Update

విపక్ష ‘ఇండియా’ కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరి కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరనున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. అయితే కూటమిలో ఏయే పార్టీలు చేరబోతున్నాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సీట్ల పంపకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఎజెండాలను ఫైనల్ చేయడంతో పాటు సీట్ల పంపకంపై చర్చ చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2024 ఎన్నికలకు ముందు వీలైనన్ని ఎక్కువ పార్టీలను ఒకే తాటి పైకి తీసుకు రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.

విపక్ష ఇండియా కూటమి సమావేశాన్ని ఈ నెల 31 నుంచి వచ్చే నెల 1 వరకు నిర్వహించనున్నారు. లోహియా పాథ్ చక్రలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. దుర్గా పూజకు ముందే ఆ నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. ఈ ప్రాజెక్టును తాను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నానన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీరి పోతాయన్నారు.

బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చే విషయంలో నితీశ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పటి వరకు విపక్ష ఇండియా కూటమిలో 26 పార్టీలు చేరాయి. ఇప్పటికే ఈ కూటమి రెండు సమావేశాలను నిర్వహించింది. మొదటి సమావేశాన్ని జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో, రెండవ సమావేశాన్ని జూలై 17-18 తేదీల్లో పశ్చిమ బెంగాల్ రాజధాని బెంగళూరులో జరిపింది.

#bjp #meeting #bihar #india #upa #cm-nitish #allliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe