‘ఇండియా’ కూటమిలోకి మరి కొన్ని పార్టీలు.... నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు...!
విపక్ష ‘ఇండియా’ కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మరి కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరనున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. అయితే కూటమిలో ఏయే పార్టీలు చేరబోతున్నాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సీట్ల పంపకంతో పాటు ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు.