Bihar Floor Test : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. ఆ ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌!

బీహార్‌ అసెంబ్లీలో కాసేపట్లో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇటివలే మహాకుటమీని వదిలి బీజేపీ పక్షనా చేరారు జేడీయూ నేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్. నితీశ్‌కు ప్రస్తుతం 128మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. అందులో ఐదుగురు ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ అయ్యాయి. అవిశ్వాసం నెగ్గడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 122.

Bihar Floor Test : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. ఆ ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌!
New Update

Bihar Floor Test : బీహార్‌(Bihar) సీఎం నితీశ్‌ కుమార్(Nitish Kumar) ఈరోజు(ఫిబ్రవరి 12) అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలి. బలపరీక్షకు ముందు జేడీయూ(JDU) తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఉదయం 11:30 గంటలకు సెంట్రల్‌ హాల్‌లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. ఈ సమయంలో శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ హాజరుకానున్నారు. ముందుగా అసెంబ్లీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత స్పీకర్‌ తొలగింపు తీర్మానం ప్రతిపాదనను పరిశీలిస్తారు. స్పీకర్‌పై నిర్ణయం వెలువడిన తర్వాత సీఎం సభలో విశ్వాస తీర్మానం నిర్వహించనున్నారు. స్పీకర్‌ను తొలగించాలంటే నితీశ్‌కు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఆఫ్:
ఇక బల పరీక్షకు ముందు పాట్నాలోని విజయ్ చౌదరి(Vijay Chowdary) నివాసంలో ఆదివారం జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలంతా సభలో ఐక్యంగా ఉండాలని నితీశ్ కోరారు. అయితే ఈ సభకు నలుగురు జేడీయూ(JDU) ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. బీమా భారతి, సుదర్శన్, దిలీప్ రాయ్, రింకూ సింగ్ మీటింగ్‌కు రాలేదు. ఈ ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు సమాచారం. మరోవైపు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జితన్ రామ్ మాంఝీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. ఇది నితీశ్‌-బీజేపీ టీమ్‌(Nitish-BJP Team) ని కాస్త కలవరపెడుతోంది.

Also Read : Valentine Week: ఈ హగ్‌ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!

క్రాస్‌ ఓటింగ్ జరిగే చాన్స్?
అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) స్వయంగా బీహార్‌పై ఫోకస్ పెట్టారు. పాట్నా రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నారు. అటు నితీశ్‌ ప్రభుత్వం బలపరీక్షలో పడిపోతుందని కాంగ్రెస్ అంటోంది. అధికార పక్షం, విపక్షాల మధ్య నెలకొన్న పొలిటికల్‌ టెన్షన్‌లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై కత్తి వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. బీహార్‌ అసెంబ్లీకి మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్‌ 122. అధికార పార్టీకి చెందిన 128 మంది ఎమ్మెల్యేల్లో 123 మందిహాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తే స్పీకర్ పీఠం గల్లంతు కావడం ఖాయం. అయితే క్రాస్ ఓటింగ్ ప్రమాదం మాత్రం అలాగే ఉంది. నిజానికి నితీశ్‌ ప్రభుత్వానికి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ప్రతిపక్ష మహాకూటమిలో ప్రస్తుతం 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికార, విపక్షాల మధ్య కేవలం 13 మంది ఎమ్మెల్యేల మద్దతే తేడా ఉంది. అందులో నితీశ్‌ టీమ్‌కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయి. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

Also Read : రాత్రివేళ భయంకర శబ్దాలు..చేపల శృంగారమే కారణమా?

WATCH:

#bjp #bihar #nitish-kumar #jdu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe