Kurchi Madatha Petti: కుర్చీ మడతపెట్టి.. బిగ్ బాస్ ఫేమ్ మానస్, శ్వేతా నాయుడు దుమ్ములేపేశారు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కామన్ ఆడియన్స్ నుంచి సెలెబ్రెటీస్ వరకు అందరు ఈ సాంగ్ పై రీల్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ మానస్, యూట్యూబర్ శ్వేత నాయుడు ఈ పాటకు స్టెప్పులేస్తూ దుమ్ములేపారు.

New Update
Kurchi Madatha Petti: కుర్చీ మడతపెట్టి.. బిగ్ బాస్ ఫేమ్ మానస్, శ్వేతా నాయుడు దుమ్ములేపేశారు..!

Kurchi Madatha Petti Song: సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గుంటూరు కారం (Guntur Kaaram). ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన కుర్చీ మడతపెట్టి సాంగ్ మాములుగా ట్రెండ్ అవ్వట్లేదు. ఎక్కడ చూసిన ఇదే పాటు మోగిపోతుంది. ముందుగా ఈ సాంగ్ పై అభిమానుల నుంచి విమర్శలు వచ్చినప్పటికి.. ఆ తర్వాత ఈ పాట యమ వైరలయ్యింది. ఇక ఇప్పుడు కుర్చీ మడతపెట్టి అంటూ కామన్ ఆడియన్స్ నుంచి బుల్లి తెర సెలెబ్రెటీస్ వరకు డాన్స్, రీల్స్ వీడియోలు చేస్తూ ఇన్స్టా లో హల్ చల్ చేస్తున్నారు. ఇక తాజాగా బుల్లి తెర సెలెబ్రెటీస్ మానస్, శ్వేత నాయుడు ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

కుర్చీ మడతపెట్టిన మానస్, శ్వేతనాయుడు

వీడియోలో మానస్ (Maanas) మహేష్ బాబు గెటప్ లో, యూట్యూబర్ శ్వేత నాయుడు (Swetha Naidu) సేమ్ టూ సేమ్ శ్రీలీల ఔట్ ఫిట్ లో మాస్ స్టెప్పులు వేస్తూ దుమ్ములేపేశారు. మామూలుగానే మానస్, శ్వేత నాయుడు ఇద్దరు సూపర్ డాన్సర్స్.. ఇంకా ఈ మాస్ బీట్ కు మరింత రెచ్చిపోయి కుర్చీ మడత పెట్టేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ ఈమోజీస్ తో సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్‌.. మేకింగ్‌ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్‌!

publive-image

శ్వేత నాయుడు యూట్యూబర్, డీ డాన్సర్ గా చాలా మందికి పరిచయం. ఇక బిగ్ బాస్ తో ఫుల్ పాపులరైన మానస్.. టీవీ షోస్, వెబ్ సీరీస్ చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మానస్ నటిస్తున్న బ్రహ్మముడి సీరియల్ (Brahmamudi Serial) టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తుంది. దీంతో మానస్ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలే ఈ బుల్లి తెర హీరోకు శ్రీజ అనే అమ్మాయితో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీరియల్ నటులు సందడి చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మానస్ నటించిన మ్యాన్షియన్ 24 సీరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Naa Saami Ranga: వీరాభిమాని చేసిన పనికి నాగ్‌ షాక్‌.. ఏం చేశాడో చూడండి!

Advertisment
తాజా కథనాలు