Bigg Boss 7 Winner: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..

అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో బిగ్‌బాస్‌-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన ప్రశాంత్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

New Update
Bigg Boss 7 Winner: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..

Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా ఎంటర్ అయ్యి.. తనదైన శైలిలో గేమ్స్ ఆడుతూ.. ప్రజల మనసు గెలుచుకొని బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ చిక్కుల్లో పడ్డాడు. నిన్న (బుధవారం) బిగ్‌బాస్‌-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ అయ్యాడు. గజ్వేల్‌ మండలం కొల్గూరూలో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో పల్లవి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. బిగ్ బాస్ 7 విన్నర్ (Bigg Boss 7 Winner) అయిన తరువాత ప్రశాంత్ బయటకు వచ్చే సమయంలో జూబ్లీహిల్స్‌లో ప్రశాంత్‌ అభిమానులు బీభత్సం సృష్టించారు. ప్రశాంత్ అభిమానులు చేసిన దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రవిరాజును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) , అతని సోదరుడు రవిరాజును అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన దాడి ఘటనలో పల్లవి ప్రశాంత్, అతని సోదరుడికి దాదాపు ఆరు గంటల పాటు విచారించారు పోలీసులు. అన్నపూర్ణ స్టూడియోస్ వెనుక గెట్ నుంచి వెళ్లాలని పల్లవి ప్రశాంత్ ను పోలీసులు ముందుగానే హెచ్చరించిన వారి మాటలు లెక్కచేయని ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్ గెట్ నుంచి బయటకు వెళ్లడం.. అక్కడ భారీగా అభిమానులు ఉండడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన, ప్రభుత్వ ఆస్తి నష్టం వంటి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు రవిరాజుకు రిమాండ్ విధించారు. చంచల్ గూడ జైలుకు వారిద్దరిని తరలించారు పోలీసులు.

ALSO READ: టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే..

Advertisment
తాజా కథనాలు