/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/789-jpg.webp)
Hari Hara Veera Mallu Poster: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సినీ ఇండస్ట్రీనుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ వెలువడుతున్నాయి. ఇప్పటికే 'జై హనుమాన్'నుంచి పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేయగా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి సందర్భంగా పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ మేకర్స్ సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు.
జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… 🏹
మీ ముందుకు... ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! #HariHaraVeeraMallu Teaser Out Soon! 🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes pic.twitter.com/RhKNeTSGjW
— Hari Hara Veera Mallu (@HHVMFilm) April 17, 2024
ఇది కూడా చదవండి: Jai Hanuman : ఇది నా వాగ్దానం.. శ్రీ రామనవమి సందర్భంగా ‘జై హనుమాన్’ నుంచి బిగ్ అప్ డేట్!
చేతిలో కత్తి.. కోర చూపులతో..
ఈ మేరకు 'హరిహరి వీరమల్లు' టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో’ అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ లేటెస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతిలో కత్తిపట్టుకుని, కోర చూపులతో పవర్ స్టార్ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలంలో విడుదలకానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Celebrating the extraordinary bravery, grace, and boundless compassion of our #HariHaraVeeraMallu, @pawankalyan garu, on this exhilarating day! 🎉🔥 #HBDJanaSenaniPawanKalyan 🎂💫 @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs… pic.twitter.com/uqBXh7lx0c
— Hari Hara Veera Mallu (@HHVMFilm) September 1, 2023