Gummanur Jayaram : వైసీపీ(YCP) ని వీడేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) సిద్ధమయ్యారు. గుమ్మనూరు ఎప్పటి నుంచో పార్టీని వీడతారని టాక్ నడుస్తోంది. గత కొన్న ఇరోజులుగా ఆయన అజ్ఞాతంలోకి కూడా వెళ్ళారు. ఇప్పుడు గుమ్మనూరు ఈ నెల 22న అంటే మరో రెండు రోజుల్లో టీడీపీ(TDP) లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి గుంతకల్లు సీటు ఆఫర్ రావడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గుమ్మనూరు ఈ రోజు హైదరాబాద్(Hyderabad) లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీ కండువా కప్పుకునే డేట్‌ను ఖరారు చేయనున్నారు.
ఎంపీ టికెట్ ఇచ్చినందుకే..
2024 ఎన్నికల్లో ఎలా అయినా గెలవలాని పట్టుదలగా ఉంది వైసీపీ. దీని కోసం ఈసారి పార్టీ నుంచి ఎవరు చేరితే గెలుస్తారో అంటూ సర్వేలు చేయించారు సీఎం జగన్(CM Jagan). దాని ప్రకారం చాలా చోట్ల అభ్యర్ధులను మారుస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చాలా మంది పార్టీని వీడి వెళుతున్నారు. ఇందులో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఒకరు. ఇప్పటివరకు ఆలూరు ఎమ్మెల్యే, మంత్రిగా గుమ్మనూరు జయరాం ఉన్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో గుమ్మనూరును అధిష్టానం అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేయాలని..ఎంపీగా టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పింది. ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా వేరే వ్యక్తిని కూడా నియమించింది. దీంతో అప్పుడే గుమ్మనూరు పార్టీకి గుడ్ బై చెబుతామని నిర్ణయించుకున్నారు.
ఆ ముగ్గురే టార్గెట్ అంటున్న గుమ్మనూరు..
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ ఇవ్వడం మీద సీఎం జగన్ సర్ది చెప్పినా జయరాం కన్విన్స్ కాలేదు. దాంతో పాటూ రాంపురం బ్రదర్స్ వల్లే తనకు సీటు రాలేదని గుమ్మనూరు ఆగ్రహంగా ఉన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి...గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డిని ఓడిస్తానని గుమ్మనూరు శపథం చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే ఇన్నాళ్ళు జయరాం ఏ పార్టీలో చేరుతారని స్పష్టత రాలేదు. కాంగ్రెస్, టీడీపీ ఇద్దరినీ సంప్రదించారని...అందులో టీడీపీ గుంతకల్లు నుంచి సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది.
Also Read : Andhra Pradesh : మైలవరం వైసీపీలో కొత్త ట్విస్ట్