Avinash: వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్ తగిలింది. నిన్న రాత్రి దుబాయ్ వెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేయగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. అవినాష్ టూర్‌పై మంగళగిరి రూరల్ పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారికి తెలిపారు. దీంతో ఆయనను ప్రయాణించేందుకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేది ఏమి లేక అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు అవినాష్.
Also Read : డేంజర్ బెల్స్.. పాకిస్థాన్ లో మంకీ పాక్స్!
టీడీపీ కార్యాలయంపై..
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో అవినాష్‌పై కేసు నమోదైంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. మరోవైపు కేసు నుంచి తప్పించుకోవడానికే అవినాష్ విదేశాలకు పారిపోవాలని అనుకున్నారని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.