Monkeypox in Pakistan: ఇటీవల ఆఫ్రికా వెలుపల స్వీడన్ లో మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతలో మన పొరుగుదేశం పాకిస్థాన్ లో మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ లో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియచేస్తోంది. వార్తా సంస్థ ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ రాయిటర్ ఇచ్చిన కథనం ప్రకారం పాకిస్థాన్ లో ముగ్గురు మంకీ పాక్స్ బారిన పడ్డారు. ఈ ముగ్గురూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి పాకిస్తాన్‌కు వచ్చినట్టు అక్కడి హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Monkeypox in Pakistan: డేంజర్ బెల్స్.. పాకిస్థాన్ లో మంకీ పాక్స్!
ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే బాగా విస్తరించిన మంకీ పాక్స్ ఇతర దేశాల్లోనూ వ్యాపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మొన్న స్వీడన్ దేశంలో ఒక పాజిటివ్ కేసు కనిపించింది. తాజాగా పాకిస్థాన్ లోనూ మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
Translate this News: