MP Dharmapuri Arvind: నిజామాబాద్ బీజేపీలో (Nizamabad BJP) అంతర్గత పోరు తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి బీజేపీ తరపున లోక్‌సభ (Lok Sabha) టికెట్ ఇవ్వడంపై బీజేపీ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ కార్యకర్త సతీష్ ఎంపీ అర్వింద్‌కి మరోసారి టికెట్ ఇవ్వొద్దు అంటూ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై మొదటి నుండి బీజేపీ పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనడని, అసలు కార్యకర్తలతో కలుపుగోలు తనం అతనికి ఉండదని, ఎల్లప్పుడూ సొంత నిర్ణయాలే తీసుకుంటాడని, కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా, పోరాటాలు చేసి అరెస్ట్ అయినా కూడా పట్టించుకోరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎంపీ.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్
ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఉంచడమే ఎక్కువని.. అలాంటిది మరోసారి ఎంపీ స్థానాన్ని అసలు ఇవ్వొద్దు అంటూ బీజేపీ కార్యకర్తలు హైకమాండ్‌ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని ఎంపీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే తప్పకుండా ఓడిస్తామని అధిష్టానాన్ని హెచ్చరించారు.
ప్రజల్లోకి బండి సంజయ్...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ (BRS) పార్టీ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను నిండా ముంచితే, ఆశలు కల్పిస్తూ హడావుడి చేయడమే తప్ప కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ రెండు కుటుంబ పార్టీలేనని ఫైర్ అయ్యారు. ఆ చీడను వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ హితం కోసం అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ (Modi Govt) సర్కార్ నినాదంతో… మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకై జరుగుతున్న ఈ మహాయాగంలో మరోసారి సమిధగా మారడానికి కరీంనగర్ బిడ్డ సిద్ధమయ్యాడని చెప్పుకొచ్చారు బండి.