ICC World Cup Final: వరల్డ్‌ కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. వీక్షకుల కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు..

వరల్ట్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం చూసేందుకు కోట్లాది మంది అభిమానులు సిద్ధం అయిపోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు హోటళ్లు, క్లబ్బులు, పబ్బులలో వీక్షకుల కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.

New Update
ICC World Cup Final: వరల్డ్‌ కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. వీక్షకుల కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు..

వరల్డ్‌ కఫ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం 2 గంటలు అవుతుందా అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. అయితే తెలంగాణలో ఓవైపు ఎన్నికల సందడి వాతావరణం ఉండగా.. ఈరోజు వరల్డ్‌ కఫ్‌ ఫైనల్స్ కావడంతో హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. ఇందుకోసం భారీ తెరలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే పలు హోటళ్లు, క్లబ్బుల్లో యువకులు పెద్దఎత్తున బుకింగ్స్ చేసుకున్నారు. అమ్నిషియా, ఫర్జీ, కేఫ్, వయోలా తదితర పబ్బులు, హోటళ్లలో ఇప్పటికే భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్ని హోటళ్లలో ఈరోజు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించాయి. భారత్ ప్రపంచ కప్‌ గెలిస్తే.. బిల్లులో డిస్కౌంట్ ఇస్తామని ఓ పబ్ నిర్వాహకుడు తెలిపాడు. రాష్ట్రంలో రాజకీయ నేతలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు చేస్తుండగా.. ఈరోజు మధ్యాహ్నం నాటికే తమ ప్రచారాలు ముగించేలా చూసుకుంటున్నారు.

Also Read: ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. 6వేల మందికి పైగా భద్రతా సిబ్బంది..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లైవ్‌ మ్యాచ్‌ను ప్రసారం చేసేందుకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ పూర్తి ఏర్పా్ట్లు చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లను తీసుకొచ్చింది. విశాఖపట్నం- ఆర్‌కే బీచ్, గుంటూరు- ఎంజీ హైస్కూల్ గ్రౌండ్స్, ఏలూరు- ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్, విజయవాడ- మునిసిపల్ స్టేడియం,విజయనగరం- ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్‌,కడప- ఆర్ట్స్ కాలేజీ,కాకినాడ- ఆర్ఎంసీ గ్రౌండ్స్, కర్నూలు- డీఎస్ఏ స్టేడియం, అనంతపురం- పీటీసీ గ్రౌండ్స్, నెల్లూరు- వీఆర్ హైస్కూల్ గ్రౌండ్స్, ఒంగోలు- జెడ్పీ మినీ స్టేడియం, శ్రీకాకుళం- స్కూల్ గ్రౌండ్స్, తిరుపతి- కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్‌లలో ఈ భారీ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు