Chandrababu: చంద్రబాబుకు బెయిల్..కండిషన్లు ఇవే

ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. బాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు.

New Update
Chandrababu: చంద్రబాబుకు బెయిల్..కండిషన్లు ఇవే

Chandrababu Gets Interim Bail: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు (Chandrababu Naidu) నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు (High Court) ఈరోజు తీర్పు చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్‌ 24 వరకు షరతులతో కూడిన బెయిల్‌ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 24న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది. దాంతో పాటు  బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే  మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు.

కోర్టు విధించిన షరతులు..
- ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.
- కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దు
- ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది...
- చంద్రబాబుతో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..
- Z+ సెక్యూరిటీ విషయంలో... కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య..

Also read:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు

కంటికి శస్త్రచికిత్స అవసరం అంటూ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ బాబు లాయర్లు వేశారు. అయితే ఇప్పటికిప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని సీఐడీ (CID) తరపు లాయర్లు వాదించారు. కానీ బాబు ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన లాయర్లు కోర్టును కోరారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికలను సీఐడీ కోర్టుకు సమర్పించింది. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, పైగా బరువు పెరిగారని సీఐడీ లాయర్లు కోర్టు దృష్టి తీసుకెళ్ళారు. అయితే హైకోర్టు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పును ఇచ్చింది. ఈ అనుబంధ పిటిషన్ మీద నిన్న విచారణ పూర్తి చేశారు. ఈరోజు న్యాయమూర్తి తల్లా ప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు.

Also read:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్

చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ (TDP) శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. దీంతో కడపలో సంబరాలు మొదలుపెట్టారు.  పులివెందుల ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు