Telangana : కేసీఆర్, హరీష్‌రావుకు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By B Aravind 05 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Big Shock To KCR - Harish Rao : మాజీ సీఎం కేసీఆర్ (KCR), హరీష్ రావు (Harish Rao), స్మితా సబర్వాల్ (Smitha Sabharwal) కు బిగ్ షాక్ తగిలింది. వీళ్లకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగడంతో ప్రజా ధనానికి భారీ నష్టం జరిగిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు నోటీసులు పంపిన న్యాయస్థానం.. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే ఎమ్మెల్యే హరీష్‌రావు, మేగా కృష్ణారెడ్డి, రజత్‌కుమార్, ఎల్‌అండీటీ ఎండీ సురేష్‌కుమార్, ఇరిగేషన్ చిఫ్ ఇంజినీర్లు హరి, రామ్‌కు సైతం నోటీసులు జారీ చేసింది. Also Read: మానవాళికి మరో ముప్పు.. చైనాలో బయటపడ్డ 125 వైరస్‌లు రూ.35 వేల కోట్ల ప్రాజెక్టును.. రూ.లక్ష 35 వేల కోట్లకు వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందుకు తాము న్యాయ పోరాటం చేస్తున్నామని రాజలింగమూర్తి అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి తప్పులు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమ కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు చేరవేస్తామని తెలిపారు. రేపటి భవిష్యత్తు తరాలకు చెరువులను, కుంటలను పునర్నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. #kcr #harish-rao #smitha-sabarwal #medigadda-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి