Bhole Baba : మీడియా ముందుకు భోలే బాబా.. ఎవరూ తప్పించుకోలేరంటూ షాకింగ్ కామెంట్స్!

హత్రాస్‌ సత్సంగ్‌ కార్యక్రమంలో 121 మంది మరణాలకు కారణమైన భోలే బాబా ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు. ఈ దుర్ఘటనతో తానెంతో వేదనకు గురయ్యానన్నాడు. భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని, బాధ్యులెవరూ తప్పించుకోలేరన్నారు.

Bhole Baba : మీడియా ముందుకు భోలే బాబా.. ఎవరూ తప్పించుకోలేరంటూ షాకింగ్ కామెంట్స్!
New Update

Hathras : యూపీ (Uttar Pradesh) హత్రాస్‌ తొక్కిసలాట ఘటన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చాడు భోలే బాబా (Bhole Baba). ఆ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘జులై 2 ఘటనతో మేం చాలా వేదనకు గురయ్యాం. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. తొక్కిసలాటకు కారణమైన వారంతా తప్పించుకోలేరు. బాధ్యులందరికీ శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నా. నాకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది. మృతులు, గాయపడిన కుటుంబాలకు అండగా ఉండాలని మా కమిటీ సభ్యులకు చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చారు.

జులై 2న హత్రాస్ లో నిర్వహించిన సత్సంగ్‌కు 80వేల మందికి ఏర్పాట్లు చేయగా దాదాపు రెండున్నర లక్షలమంది హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకోగా 121 మందికి పైగా మరణించారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. ‘సేవాదర్‌ ఆర్మీ’ (Sevadar Army) గా పిలిచే బృందం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. ప్రధాన సూత్రదారుడైన దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : కొండచరియలు విరిగిపడి హైదరాబాద్‌ పర్యాటకులు మృతి

#uttar-pradesh #bhole-baba #hathras-satsang
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe