Hyderabad Tourists: కొండచరియలు విరిగిపడి హైదరాబాద్‌ పర్యాటకులు మృతి

ఉత్తరాఖండ్‌ చమోలిలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు ఢీకొని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. మృతులు నిర్మల్ షాహి (36), సత్య నారాయణ (50)లుగా గుర్తించారు.

New Update
Hyderabad Tourists: కొండచరియలు విరిగిపడి హైదరాబాద్‌ పర్యాటకులు మృతి

Hyderabad Tourists: ఉత్తరాఖండ్‌ చమోలిలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు ఢీకొని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చత్వాపీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. మృతులు నిర్మల్ షాహి (36), సత్య నారాయణ (50)లుగా గుర్తించారు. హిమాలయ దేవాలయం నుంచి మోటారు సైకిల్‌పై తిరిగి వస్తుండగా బండరాళ్లు ఢీకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు