Morning Walk: రోజూ ఉదయాన్నే కొన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుత కాలంలో ఉదయం, సాయత్రం వాకింగ్ చేసివారు సంఖ్య అధికంగా ఉన్నా.. మరికొందరి వాక్ అనే చేయటం కుదరని విషయం తెలిసిందే. అయితే.. వాక్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయం తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఫిట్‌గా ఉండడమే కాకుండా అనారోగ్యానికి గురైయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం వాక్ చేయడం వలన ఆరోగ్యంగా ఉంటాయరు. కానీ ఈ నడక తప్పుగా చేస్తే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వార్మప్ ముఖ్యం:
- ఉదయం వాక్ ఆరోగ్యానికి చాలామంచిది. అయితే, మార్నింగ్ వాక్ పద్ధతి ఖచ్చితంగా సరైనదిగా ఉండాలంటున్నారు ఫిట్నెస్ నిపుణులు . ఉదయాన్నే తప్పుడు మార్గంలో నడిస్తే, అది అనారోగ్యానికి గురి చేస్తుందంటున్నారు. వైద్య శాస్త్రం ప్రకారం.. నడిచే ముందు 5-10 నిమిషాల వార్మప్ చేయడం ముఖ్యం. ఉదయం వాక్‌కి ముందు వేడెక్కడం అత్యంత ముఖ్యమైనదని అంటున్నారు. దీనివలన శరీరం నడకకు సిద్ధమై కండరాలు సక్రమంగా పనిచేస్తాయి. దీంతో నడక మెరుగ్గా ఉండి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు ఆరోగ్యంగా, గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు అదుపులో ఉంటుందంటున్నారు.
వాటర్ తాగాలి:
- ఉదయం వాక్‌కి బయటకు వెళ్లినప్పుడల్లా నీళ్లు ఖచ్చితంగా తాగాలి. ఇది వాకింగ్ చేసేటప్పుడు బాడీ హైడ్రేషన్ మెయింటెన్ చేస్తుంది. ఉదయం వాకింగ్ చేసే ముందు నీళ్లు తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరిగి శరీరం చురుగ్గా ఉంటుంది. అంతేకాకుండా వాక్ కోసం బయటకు వెళ్తుంటే బరువుగా ఏమీ తినకూడదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఉదయం ఏదైనా తినవలసి వస్తే, తేలికపాటి, పోషకమైన ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం. పండ్లు, పెరుగు, గంజి వంటి వాటిని తీసుకోవడం మేలు చేస్తుంది. ఇది శక్తిని అందించి ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచేదుకు సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : వేడి, చల్లటి అన్నం అంటే ఇష్టమా..? ఆరోగ్యానికి ఏది ఉత్తమమైదో తెలుసా..!!
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.