మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రోజూ ఉదయం వాకింగ్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా మలవిసర్జన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు వాటర్ తాగడం, స్ట్రెచింగ్ వ్యాయామాలు వంటి నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఉదయం వాకింగ్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా మలవిసర్జన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు వాటర్ తాగడం, స్ట్రెచింగ్ వ్యాయామాలు వంటి నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
గంటల తరబడి నడిచినా బరువు తగ్గడం లేదని కొందరు వాపోతున్నారు. మీ విషయంలో కూడా అదే జరుగుతుంటే, మీరు నడకలో కొన్ని తప్పులు చేస్తున్నారని అర్థం చేసుకోండి. అయితే నడిచేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకోండి..
ఉదయం 7 నుండి 8 గంటల మధ్య సూర్యరశ్మి శరీరానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాలు నడవాలి.దీని కంటే ఎక్కువ ఎక్స్పోజర్ మీ చర్మానికి హాని కలిగిస్తుంది.
నడవడం, వ్యాయామం చేయడం వల్ల చాలా చెమట పట్టడంతోపాటు కేలరీలు బర్న్ అవుతాయి. ఇది శరీరంలో నీటి కొరతకు కారణం కావచ్చు. నడక నుండి తిరిగి వచ్చిన తర్వాత, మీరు చేయవలసిన మొదటి పని తేనె , నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి.
ఉదయం వాకింగ్ వెళ్తున్నవారు 10 నిమిషాల ముందు వార్మప్ చేయాటంతోపాటు నీరు ఎక్కువగా తీసుకోవాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు ఆరోగ్యంగా, గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు అదుపులో ఉంటుందంటున్నారు.
అధిక బరువుతో బాధపడుతున్న వారు 5 సూత్రాలను అలవాటు చేసుకోవడం వల్ల బరువు తగ్గిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే లేవడం, డిటాక్స్ వాటర్ తాగడం, ధ్యానం చేయడం వంటి సూత్రాలను అలవాటు చేసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోతారు.