Jd chakravarthy: జేడీ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు!

జేడీ చక్రవర్తి ఈ మధ్య దయా అనే వెబ్‌ సిరీస్‌ లో నటించారు. అందులో తన నటనతో అందర్ని ఆకట్టుకున్నారు. అందులోని నటనకు గానూ తాజాగా ఆయన ఉత్తమ నటుడి అవార్డ్‌ ను అందుకున్నారు.

New Update
Jd chakravarthy: జేడీ చక్రవర్తికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు!

శివ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన జేడీ చక్రవర్తి(Jd chakravarthy) తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో తన నటన ద్వారా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. చాలా కాలం గ్యాప్‌ తరువాత మళ్లీ ఆయన నటుడిగా ఫుల్‌ బిజీగా మారుతున్నారు.

వెండితెర మీదే కాకుండా ఓటీటీల్లో కూడా కొత్త కొత్త కంటెంట్‌ ను ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు. కొత్త కథలు, భిన్న పాత్రలు ఆయనను కోరి వస్తున్నాయి. ఆయన కూడా అలానే భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే జేడీ చక్రవర్తి ఈ మధ్య దయా (dhaya) అనే వెబ్‌ సిరీస్‌ లో నటించారు.

అందులో తన నటనతో అందర్ని ఆకట్టుకున్నారు. అందులోని నటనకు గానూ తాజాగా ఆయన ఉత్తమ నటుడి అవార్డ్‌ ను అందుకున్నారు. ఓటీటీ ప్లే అనే సంస్థ దేశ వ్యాప్తంగా వచ్చిన ఓటీటీ కంటెంట్‌ లో ఏది బెస్ట్‌ గా ఉందో దానిని ఎంచుకుని అవార్డులతో సత్కరించింది. ఓటీటీలో రిలీజ్‌ అయిన వెబ్‌ సిరీస్‌ లకు కూడా ఈ అవార్డులు వచ్చాయి.

ఇందులో భాగంగానే దయా వెబ్‌ సిరీస్‌ కు రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్‌ డైరెక్టర్‌ , బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో '' దయా'' కు అవార్డులు వచ్చాయి. జేడీకి అవార్డులు ఇది కొత్త కాదు..నైజీరియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది.

Also read: ప్రముఖ నటుడు కన్నుమూత..ఆలస్యంగా వెలుగులోకి!

Advertisment
తాజా కథనాలు