Elon Musk: అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్‌.. ఫస్ట్‌ ఎవరంటే

ప్రపంచంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) వ్యవస్థాపకుడు 'బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌' నిలిచారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. మూడో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు.

New Update
Elon Musk: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు  కోల్పోయాడంటే.!

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే టక్కున ఎలాన్ మస్క్ అని చెబుతారు. కానీ ఇప్పుడు ఆయన రెండో స్థానానికి పడిపోయారు. మొదటి స్థానంలో గ్లోబల్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అండ్ సీఈఓ 'బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌' నిలిచారు. ఫోర్బ్స్‌ ప్రకారం చూసుకుంటే.. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ కుటుంబం నికర విలువ శుక్రవారం రోజున 23.6 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపంద 207.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా బెర్నార్డ్‌ ఆర్నాల్డ్ నిలిచిపోయాడు. ఇక ఎలన్ మస్క్‌ సంపద చూసుకుంటే 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది. బైర్నాల్డ్, ఎలన్ మస్క్ మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, మార్క్‌ జూకర్‌బర్ల్‌లు మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.

Also read: కారు హ్యాండ్ బ్రేక్ ని హ్యాండిల్ చేయడం ఎలా అంటే.. 

18 బిలియన్ డాలర్లు కోల్పోయిన మస్క్
అయితే గత గరువారం ఎలన్ మస్క్‌ టెస్లా షేర్లు ఏకంగా 13 శాతం పడిపోయాయి. దీంతో మస్క్‌కు ఏకంగా 18 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ఈ సమయంలోనే మరోవైపు బెర్నాల్డ్‌ ఆర్నాల్ట్‌ షేర్స్ బాగా పెరిగిపోయారు. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ మొదటిస్థానాన్ని కోల్పోయారు.

11వ స్థానంలో ముకేష్ అంబానీ
ఇక మన ఇండియాలో చూసుకుంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద 104.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితో ముకేష్ 11వ స్థానంలో ఉన్నారు. ఇక అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద 75.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన 16వ స్థానంలో ఉన్నారు.

Also Read: రసవత్తరంగా బీహార్‌ పాలిటిక్స్.. సీఎం పదవికి నితీ‌శ్‌ రాజీనామా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు