Water Crisis In Metro Cities : వేసవి కాలం(Summer) ఇంకా పూర్తిగా మొదలే కాలేదు. అప్పుడే బెంగళూరు(Bangalore) పూర్తిగా నీటి సంక్షోభంలో(Water Crisis) కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటికే నగరంలోని ప్రజలు చెంబుడు నీటి కోసం అల్లాడిపోతుంది. బెంగళూర్ కి ఆధారమైన కావేరీ నీరు తగ్గిపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రతరమైంది. ఇప్పటికే బెంగళూరు అధికారులు నీటిని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు కూడా జారీ చేశారు.
వర్షాకాలం(Rainy Season) వచ్చే వరకు ఈ తిప్పలు తప్పవని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ తిప్పలు రాబోయే కాలంలో ఒక్క బెంగళూరులో మాత్రమే కాదు... హైదరాబాద్(Hyderabad) తో పాటు దేశ వ్యాప్తంగా మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నట్లు సమాచారం. 2019లోనే నీతి ఆయోగ్ 2030 నాటికి భారత జనాభాలో కనీసం 40 శాతం మందికి తాగునీరు దొరకదని వివరించింది.
ఈ లిస్ట్ లో బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, చెన్నై బటిండా వంటి నగరాలు కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొనున్నట్లు వివరించింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ 2020 నివేదిక ప్రకారం.. 2050 నాటికి దేశంలోని సుమారు 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని పేర్కొంది.
ఈ నగరాల్లో జైపూర్, ఢిల్లీ, అమృత్‌సర్, పూణె, ఇండోర్, శ్రీనగర్, ముంబైతో పాటు ఏపీలోని విశాఖపట్నం కూడా ఉన్నట్లు వివరించింది. భారత్ లోని సింధు- గంగా పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
Also Read : కివి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?