Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్‌ఐఏ సంచలన రిపోర్ట్‌

రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై NIA ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిందితులు జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయ వద్ద బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొంది.

New Update
Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్‌ఐఏ సంచలన రిపోర్ట్‌

ఈ ఏడాదిలో మార్చిలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిందితులు ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయం వద్ద IED బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. కానీ నిందితులు బాంబు పెట్టడంలో విఫలమైనట్లు పేర్కొంది. నిందితులను ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్ మరియు ముజమ్మిల్ షరీఫ్‌గా గుర్తించింన ఎన్‌ఐఏ వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
Also Read: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

నిందితులకు టెలిగ్రామ్‌ యాప్ ద్వారా క్రిప్టోకరెన్సీ నుంచి నిధులు సమకూరినట్లు వెల్లడించింది. ఈ నిధులతోనే నిందితులు బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు వినియోగించినట్లు పేర్కొంది. ఈ ఏడాది 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున.. కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యాలంయలో బాంబు పెట్టేందుకు ప్లాన్‌ చేశారని.. అది ఫెయిల్ కావడంతోనే రామేశ్వరం కేఫ్ బాంబ్‌ దాడికి ప్లాన్ చేశారని చెప్పింది.

ఇదిలాఉండగా.. రామేశ్వరం కేఫ్‌ బాంబు బ్లాస్ట్ కేసులో ఈ నలుగురు నిందితులు ఇప్పటికే అరెస్టయ్యారు. ప్రస్తుతం వీళ్లు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 1న రామేశ్వరం కేఫ్‌ బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే హోటల్‌లో ఉన్న వస్తువులకు కూడా భారీగా డ్యామేజ్ జరిగింది. మార్చి 3న కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) దీనిపై విచారణ ప్రారంభించింది. ఇందులో షాజిబ్ అనే నిందితుడు ఆ హోటల్‌లో బాంబు పెట్టాడని విచారణలో తేలింది. బాంబు పేలుడు ఘటన తర్వాత 24 రోజులకు షాజిబ్‌తో పాటు మతీన్ అహ్మద్ తాహాను పశ్చిమ బెంగాల్‌లో అధికారులు అరెస్టు చేశారు.

Also read: మొన్న తుంగభద్ర, నేడు ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్.. ఎవరీ కన్నయ్య నాయుడు?

వీళ్లిద్దరూ కూడా ఐఎస్‌ ఐడియాలజీని ఇతర ముస్లింలకు కూడా ప్రేరేపించేందుకు ప్రయత్నించారని ఎన్‌ఐఏ పేర్కొంది. వాళ్లలో బాంబు బ్లాస్ట్‌ కేసులో ఇరుక్కున్న మాజ్ మునీర్ అహ్మద్ మరియు ముజమ్మిల్ షరీఫ్‌ ఉన్నారని తెలిపింది. తాహా, షాజిబ్ మోసపూరితంగా పొందిన భారత సిమ్‌ కార్డ్‌లు, భారతీయ బ్యాంక్ ఖాతాలను వినియోగించారని.. అలాగే డార్క్ వెబ్ నుంచి డౌన్‌లోడ్ చేసిన వివిధ భారతీయ, బంగ్లాదేశ్ పత్రాలను కూడా ఉపయోగించినట్లు పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు