Karnataka : దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు (Sexual Assault) జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది కీచకులు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్లను కూడా వదలకుండా తమ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. 2012లో ఢిల్లీ (Delhi) లో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎలా సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. ఈ ఘటన తర్వాత మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. ఇటీవల కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ (Kolkata Junior Doctor) పై జరిగిన హత్యాచార ఘటన కూడా దుమారం రేపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు జరుగతున్నాయి.
Also Read: జూనియర్ హత్యాచార ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
ఈ ఘటన మరవకముందే బెంగళూరులో తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ యువతిపై.. ఆటోడ్రైవర్ లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. హెచ్ఎస్ఆర్ లే అవుట్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: డ్యామ్‌పై ప్రమాదకర స్టంట్.. యువకుడు మృతి