మొక్కజొన్నతో ఇన్ని బెనిఫిట్స్‌ హా..! 

ఓ వైపు వర్షం పడుతుంటే మరో వైపు వేడి వేడి ఆహారపదార్థాలు, చిరుతిళ్లు తింటే ఆ కిక్కే వేరు కదా.ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్. రెయిన్‌ సీజన్‌లో చాలామంది మొక్కజొన్న కంకులను తినేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. కొందరు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే, మరికొందరు నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో మొక్కజొన్నను తినడం అనేది టైంపాస్ కాదు.దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మొక్కజొన్నతో ఇన్ని బెనిఫిట్స్‌ హా..! 
New Update

Benefits with Corn: మొక్కజొన్న పంటను సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా పండిస్తారు.అయితే పోషకాహార నిపుణులు ఇది టైం పాస్ కోసం తినే ఫుడ్ కాదని ఇందులో ఎన్నో పోషకాలు(Nutrients), శరీరానికి తగిన క్యాలరీలు లభిస్తాయని చెబుతున్నారు. ఒక మొక్కజొన్న కంకిలో 125 క్యాలరీలు ఉంటాయి.27 గ్రాముల కార్బోహైడ్రేట్లు,4 గ్రాముల ప్రొటీన్లు,9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్‌, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుందంటున్నారు. దీని వల్ల మనకు కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

మొక్కజొన్నతో లోబీపీకి చెక్‌

corn benefits

మొక్కజొన్నలో విటమిన్‌ B12 సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ (Iron) అధికంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే ఎర్రరక్త కణాల ఉ‍త్పత్తిని పెంచేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. దీంతో రక్త హీనతను నివారించవచ్చు. మొక్కజొన్నలో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతులకు చాలా బెనిఫిట్స్ (Benefits) ఉన్నాయి. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు మొక్కజొన్న చాలా ఉపయోగపడుతుందని వైద్యులు (Doctors) వెల్లడించారు.మొక్కజొన్న తినడం ద్వారా తక్కువ బరువుతో బాధపడేవారు వెయిట్‌ పెరుగుతారు. తగిన మోతాదులో కొన్నిరోజుల పాటు వీటిని తినే ఆహారంలో చేర్చుకుంటే బరువు పెరగవచ్చు.మొక్కజొన్నలో పీచు పదార్థం (Fiber) కూడా అధికంగా లభిస్తుంది.ఇది ఆహారం జీర్ణమవడంలో (Digestion) సహాయం చేస్తుంది. అంతేకాదు మలబద్ధకాన్ని (Constipation) నివారిస్తుంది. మొక్కజొన్నలో యాంటి ఆక్సిడెంట్స్‌ (Anti Accidents) ఎక్కువగా ఉంటాయి.

Benefits with corn for Eyes: కంటి సమస్యకి ఎంతో మేలు

lifestyle-health-tips-corn-maize-cholam-health-benefits-nutrition-uses-for-skin-and-hair-recipes-side-effects

మొక్కజొన్నలో బీటాకెరోటిన్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనిలో విటమిన్‌–A కూడా పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌–A (Vitamin A) మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తుంది. అంతేకాదు మొక్కజొన్నలో విటమిన్‌ B,C (Vitamin B,C) విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.విటమిన్‌ B–కాంప్లెక్స్‌లోని థయమిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా నడిచేందుకు ఎంతగానో తోడ్పడతాయి. స్వీట్‌ కార్న్‌ అయితే శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నలో ఫెలురిక్‌ యాసిడ్‌ అనే యాంటీ–ఆక్సిడెంట్‌ ఉంటుంది. అంతేకాదు ఇది అనేక రకాల క్యాన్సర్ కారకాలను అరికట్టడంలో దిట్ట. వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే చెడు ప్రభావాలను యాంటీ ఆక్సిడెంట్లు అరికడతాయి.గాయమైనప్పుడు కలిగే వాపు, మంట, పెయిన్‌ని తగ్గించే శక్తి మొక్కజొన్నకు ఉంది. మొక్కజొన్నలో విటమిన్‌-Cతో పాటు లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచేందుకు కొల్లాజెన్‌ ఉత్పత్తి చేస్తుంది. అందుకే కార్న్‌ ఆయిల్‌, కార్న్‌ స్టార్చ్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు.

#health-benefits #lifestyle #health-benefits-of-corn #corn #benefits-with-corn
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe