Ice Bath: ఐస్ వాటర్‌తో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిద్ర బాగా పడుతుంది, బరువు తగ్గవచ్చు, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. By Vijaya Nimma 08 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ice Bath: సాధారణంగా ప్రజలు తమను తాము శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు స్నానం చేస్తుంటారు. కొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తే, మరికొందరు మామూలు నీళ్లతో తలస్నానం చేస్తారు. అయితే ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బకెట్ చాలెంజ్ అంటూ చల్లని నీటితో స్నానం చేస్తున్నారు. ప్రజలు చలికాలంలో చన్నీటి స్నానానికి దూరంగా ఉంటారు. అలాంటి సమయంలో ఐస్ బకెట్ చాలెంజ్ అని వింటే వణుకుపుట్టడం ఖాయం. కాకపోతే ఇలా ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐస్ బాత్ అనేది క్రయోథెరపీ యొక్క ఒక రూపం. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోపడుతుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తరచుగా చల్లటి నీళ్లలో స్నానం చేస్తుంటారు. నిద్ర బాగా పడుతుంది ఐస్ వాటర్‌తో స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుంది. వాస్తవానికి ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రాత్రి మంచి నిద్రపడుతుంది. గుండెకు చాలా మంచిది ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల మీ గుండెకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఐస్ బాత్ వల్ల పెరిఫెరల్ వాస్కులర్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ఎంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గవచ్చు బరువు తగ్గాలనుకుంటే ఐస్ వాటర్‌తో స్నానం చేయడంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. చల్లని నీటితో స్నానం చేయడంతో మీ ఆహారాన్ని మార్చకుండా బరువు తగ్గవచ్చు. నొప్పి నుంచి ఉపశమనం బాగా వ్యాయామం చేసిన తర్వాత చల్లని నీటితో స్నానం చేస్తే కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ, ఒత్తిడి హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మానసిక స్థితి, శక్తిస్థాయిలను పెంచుతుంది. ఇది కూడా చదవండి: చలికాలంలో ఎండలో కూర్చుంటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: సరిగా నిద్రపోకపోతే జరిగేది ఇదే..నిపుణులు ఏమంటున్నారంటే? #health-benefits #bath #ice-water మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి