Winter Season: చలికాలం ఎండలో గంటల తరబడి కూర్చొని కుటుంబ సభ్యులతో మాట్లాడటం, బఠాణీలు తినడం, ఆకుకూరలు శుభ్రం చేయడం, స్వెట్టర్లు అల్లడం, గంటల తరబడి నిద్రపోవడం లాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతాయి. ఒకప్పుడు శీతాకాలం వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లో ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చాలా బిజీ ఐపోయారు. చలికాలంలో ఎండ చేసే మేలు మర్చిపోయారు. నిజానికి చలి నుంచి ఉపశమనం పొందడానికి ఎండలో కూర్చోవడం మిమ్మల్ని శారీరకంగా బలోపేతం చేయడమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని మీకు తెలుసా.
పూర్తిగా చదవండి..Winter Season: చలికాలంలో ఎండలో కూర్చుంటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!
శీతాకాలంలో ఎండ చేసే మేలు అంతాఇంతా కాదు. శీతాకాలపు సూర్యుడు రోగనిరోధక శక్తికి టానిక్‌లా పని చేస్తాడు. ఎండ నుంచి వచ్చే విటమిన్-డి వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో ఎండలో కూర్చోవడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది.
Translate this News: