మనం సాధారణంగా కరివేపాకులని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కూరల్లో అవి వస్తే… తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. అంతే కాదు అవతలివారిని తీసిపడేసే విషయాన్నీ చెప్పేందుకుదానిని ఒక సామెతలో కూడా వాడుతాం. కూరలు, చట్నీల్లో రుచి కోసం వేసే కరివేపాకుతో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలతో పాటు కరివేపాకులో ఏ, బీ, సీ, ఈ వంటి పలు విటమిన్లు ఉండటంతో శరీరానికి అవసరమైన షోషకాలను, శక్తిని అందిస్తాయని తెలుపుతున్నారు.
ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?
వివిధ రకాల క్యాన్సర్ల నుంచి అవి మనల్ని కాపాడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కరివేపాకులో ఉండే ఫ్లేవనాయిడ్లు కలోన్ క్యాన్సర్‌ను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయని ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ జర్నల్ సంస్థ పేర్కొంది. మహిళలకు ఎక్కువగా బాధపడే బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కరివేపాకు నిలువరిస్తుంది. ఫ్లేవనాయిడ్లతో పాటు క్యుర్‌సెటిన్, కాటెచిన్, రుటిన్, గ్యాలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్స్ కరివేపాకులో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వెంట్రుకలను నల్లగా ఉంచేందుకు ఇవి కీలకంగా వ్యహరిస్తాయట.
ALSO READ: జానారెడ్డితో పాటు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్స్ రిజెక్ట్!
కరివేపాకును నిత్యం ఆహారంలో తీసుకుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. మధుమేహ నియంత్రణ, బరువు తగ్గడం, మలబద్ధకం నివారణ వంటి వాటిపై కరివేపాకు ఎంతగానో ఆరోగ్యానికి దోహద పడుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.