Lakshaya Sen: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు ఈవెంటల్లో పతకాలు గ్యారంటీగా వస్తాయని అందరూ అనుకున్నారు. అందులో ఒకటి బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్, మెన్, ఉమన్, సింగిల్, డబుల్ ఇలా అన్నింటిలో మంచి ప్లేయర్లు ఉన్నారు. విమెన్‌లో పీవీ సింధు ఇప్పటికే రెండు పతకాలు తీసుకువచ్చింది. మూడోది ఖాయం అనుకున్నారు. అలాగే మెన్ సింగిల్‌లో లక్ష్యసేన్ మీద కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలూ నిరాశలయ్యాయి. బ్యాడ్మింటన్‌లో ఒక్క పతకమూ రాకుండానే ప్లేయర్లు వెనుదిరిగారు. ఇవరి ఆశగా మిగిలి ఉన్న లక్ష్యసేన్ కాంస్యం కూడా అందినట్టే అంది...అందకుండా పోయింది. సెమీస్ వరకు వెళ్ళిన అతను మొదట అక్కడ ఓడిపోయాడు. తర్వాత కాంస్యం కోసం జరిగిన పోరులో మలేషియా ఆటగాడి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. 2–1 తేడాతో ఇంటి ముఖం పట్టాడు.
అయితే చివరి పోరులో తాను ఓడిపోవడానికి కారణం తనకు అయిన గాయమే కారణ అంఉన్నాడు లక్ష్యసేన్. మోచితికి అయిన గాయం వల్లనే ఆడలేకపోయానని చెబుతున్నాడు. ఆట మధ్యలో చేతికి గాయం అయిందని...దాని వలన పలుమార్లు ఆట ఆపాల్సి వచ్చిందని...దాని ప్రభావం గేమ్ మీద పడిందని చెపుకొచ్చాడు.
ప్లేయర్ల ప్రదర్శన మీద కోచ్ అసంతృప్తి..
ఒలింపిక్స్‌లో భారత షట్లర్ల ప్రదర్శన మీద కోచ్ ప్రకాష్ పడుకోన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళస్థాయికి తగ్గట్టు ఆడలేదని అన్నారు. భారత ప్రభుత్వం, ఫెడేషన్ ప్లేయర్ల కోసం చాలా సదుపాయాలు కల్పిస్తోందని...వారి కోసం ప్రతి ఒక్కటీ చేస్తోందని...దాని కోసం ఆటగాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. మిగతా టోర్నీల్లో సత్తా చాటుతున్న ఆటగాళ్ళు ఒలిపింక్స్ అనగానే ఎందుకు డీలా పడిపోతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు ప్రకాశ్ పడుకోన్.