Watch Video: ఇళ్లల్లోకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి.. వీడియో వైరల్

తమిళనాడులోని ఊటికి సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో.. ఒక ఎలుగుబంటి, ఒక చిరుత రాత్రి సమయంలో జనావాసాల్లోకి ప్రవేశించాయి. అక్కడి ఇంటి స్లాబులపై ఎక్కి తిరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Watch Video: ఇళ్లల్లోకి వచ్చిన చిరుత, ఎలుగుబంటి.. వీడియో వైరల్

ఈమధ్య కాలంలో జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇళ్లల్లోకి కోతులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఏకంగా పులులు, ఎలుగుబంట్లు వచ్చి జనాలపై దాడులు చేస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఎప్పడు ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందోనని భయాందోళనలో ఉంటున్నారు. అయితే తాజాగా ఓ చిరుత పులి, ఓ ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు : ఉత్తమ్

రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో.. అన్ని ఇళ్లకు కూడా గడియలు పెట్టి ఉన్నాయి. దీంతో అక్కడికి వచ్చిన పులి, ఎలుగుబంటి ఇళ్ల పైకి ఎక్కాయి. ఇంటి స్లాబులపై తిరిగాయి. అయితే ఓ ఇంటిపై ఉన్న సీసీటీవీ కెమెరాలు వీటి దృశ్యాలు నమోదయ్యాయి. తమిళనాడులోని ఊటికి సమీపంలో ఎల్లనల్లి కైకట్టి అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ముందుగా ఓ ఇంటిపై చిరుత కనిపించింది. అది అటూఇటూ తిరుగుతూ చివరికి మెట్లపైకి దూకి ఎదురింట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత అదే ఇంటిపై ఓ ఎలుగుబంటి కనిపించింది. అది కూడా అటూ ఇటూ తిరుగుతూ.. చిరుతపులి దూరిన ఇంట్లోకే వెళ్లింది. అక్కడి నుంచి ఇవి మళ్లీ ఏ ప్రదేశానికి వెళ్లాయి అన్న విషయం తెలియలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ గ్రామస్థలు మళ్లీ ఈ జంతువులు తమ గ్రామంలోకి వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also read: లక్షద్వీప్‌కు ప్రధాని రాకతో.. భారీగా పెరిగిన పర్యాటకులు సంఖ్య

Advertisment
తాజా కథనాలు