Health Tips: రొమ్ము నొప్పిని లైట్‌ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..జాగ్రత్త

రొమ్ము క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్న మహిళలు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రొమ్ము కండరాలు, కణజాలలో సంభవించే నొప్పిని నాన్-సైక్లిక్ నొప్పి అంటారు. ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయడం ఎంతో ప్రమాదకరం. అలాగే టీ, కాఫీ కొవ్వు పదార్థాలు,ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Health Tips: రొమ్ము నొప్పిని లైట్‌ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..జాగ్రత్త

Health Tips: రొమ్ములో ఏదైనా సమస్య ఉంటే దానిని నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతకం. ప్రస్తుతం చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ములో నొప్పి రెండు రకాలు ఉంటాయి. అవి సైక్లిక్, నాన్-సైక్లిక్. రొమ్ము క్యాన్సర్‌తో ఏటా లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. Sitecare నివేదిక ప్రకారం, భారతదేశంలోని ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌కు గురవుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాణాంతక వ్యాధిని సమయానికి గుర్తించకపోవడం వల్ల పరిస్థితి చేదాటి పోతోంది.

సైక్లిక్‌..నాన్‌ సైక్లిక్‌ నొప్పి అంటే ఏంటి?

  • రొమ్ము నొప్పి, వాపు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. రొమ్ము నొప్పి రెండు రకాలు. ఒకటి సైక్లిక్, మరొకటి నాన్-సైక్లిక్. పీరియడ్స్ ముందు లేదా ఆ సమయంలో వచ్చే సాధారణ నొప్పిని సైక్లిక్‌ అంటారు. రొమ్ము కండరాలు, కణజాలలో సంభవించే నొప్పిని నాన్-సైక్లిక్ నొప్పి అంటారు. ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయడం ఎంతో ప్రమాదమని నిపుణులు అంటున్నారు.

రొమ్ము నొప్పికి ఇతర కారణాలు:

  • రొమ్మునొప్పికి హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్ సమయంలో వచ్చే మార్పులు, రొమ్ములో గడ్డలు, బ్రాను సరిగా అమర్చకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంది.

రొమ్ము నొప్పి, వాపు తగ్గించడానికి చిట్కాలు:

  • సైక్లిక్‌ నొప్పి అయితే మీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నయం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల రొమ్ములలో గడ్డలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో ఇది తీవ్ర రూపం దాల్చకుండా వెంటనే చికిత్స చేయించుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే టీ లేదా కాఫీ ఎక్కువగా తాగవద్దని, కొవ్వు పదార్థాలు, ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని అంటున్నారు. ఏదైనా మందులు వాడేముందు వైద్యుడి సలహా తీసుకోవాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : పీరియడ్స్‌ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ఇలా తెలుసుకోవచ్చు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు